వాట్సాప్ పే… బ్యాంకులను సంప్రదిస్తున్న వాట్సాప్ యాజమాన్యం… పూర్తి స్థాయిలో నగదు బదిలీ సేవల కోసం…

| Edited By: Pardhasaradhi Peri

Dec 16, 2020 | 2:51 PM

భారత్‌లో వాట్సాప్ వినియోగించే వారి సంఖ్య దాదాపు 400 మిలియన్లు. అయితే కొద్ది రోజుల క్రితం వాట్సాప్ నగదు బదిలీ సేవల్లోకి ప్రవేశించింది.

వాట్సాప్ పే... బ్యాంకులను సంప్రదిస్తున్న వాట్సాప్ యాజమాన్యం... పూర్తి స్థాయిలో నగదు బదిలీ సేవల కోసం...
Follow us on

భారతీయులు అత్యధికంగా వినియోగిస్తున్న యాప్ వాట్సాప్… వాట్సాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన విషయం తెలిసింది. భారత్‌లో వాట్సాప్ వినియోగించే వారి సంఖ్య దాదాపు 400 మిలియన్లు. అయితే కొద్ది రోజుల క్రితం వాట్సాప్ నగదు బదిలీ సేవల్లోకి ప్రవేశించింది. కానీ, కేవలం వాట్సాప్ యూజర్లలో 1 మిలియన్ ప్రజలకు మాత్రమే నగదు బదిలీ సేవలను అందుబాటులోకి ఉంచింది.

 

కాగా గత నెల నేషనల్ పేమెంట్ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా వాట్సాప్‌కి 20 మిలియన్ల యూజర్లకు నగదు బదిలీ చేసే అవకాశాన్ని కల్పించేందుకు అంగీకారం తెలిపింది. దీంతో వాట్సాప్ యాజమాన్యం దేశీయ బ్యాంకులతో చర్చలు జరుపుతోంది. తమ సేవల్లో ఎటువంటి అంతరాయాలు లేకుండా, బ్యాంకు సేవలు నిరంతరంగా అందించేందుకు ప్రయత్నిస్తోంది. కాగా వాట్సాప్‌ పే విధానంలో ఇప్పటి వరకు కస్టమర్ టు కస్టమర్ మనీ ట్రాన్స్‌ఫర్ విధానమే ఉంది. కస్టమర్ టు మర్చంట్ విధానం మనీ ట్రాన్స్ఫర్ విధానం అందుబాటులో లేదు.