స్నేహ హస్తం… బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపిన రష్యా అధ్యక్షుడు… కలిసి పని చేయాలని ఆకాంక్ష…

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ శుఖాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పుతిన్ ఒక ప్రకటనను విడుదల చేశారు.

స్నేహ హస్తం... బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపిన రష్యా అధ్యక్షుడు... కలిసి పని చేయాలని ఆకాంక్ష...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 16, 2020 | 1:59 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ శుఖాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పుతిన్ ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో పుతిన్ తాను అమెరికాతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో ప్రపంచ దేశాల రక్షణ, సుస్థిరత కోసం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. అందుకోసం ఇన్నాళ్లు అమెరికాకు, రష్యాకు మధ్య ఉన్న విబేధాలను పక్కనపెడుదాం అని కోరారు.

కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని అన్నారు. కాగా, ట్రంప్ అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం ఉందని, పుతిన్ బైడెన్‌కు సాయం చేస్తున్నారని ప్రచారం సందర్భంగా ఆరోపించారు. కానీ, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్‌కు అగ్రరాజ్యాధినేతైన పుతిన్ తాజాగా, చివరగా శుభాకాంక్షలు తెలిపారు.