Mahindra: బ్రిటన్‌లో నేరాల కట్టడికి భారత ఆటోలు.. రంగంలోకి మహీంద్రా ఎలక్ట్రిక్‌ వాహనాలు..

నేరాల కట్టడికి హై ఎండ్‌ ఫీచర్స్‌ ఉన్న పెట్రోలింగ్ వాహనాలను ఉపయోగిస్తారనే విషయం తెలిసిందే. అయితే బ్రిటన్‌లో మాత్రం ఆటోలను ఉపయోగిస్తున్నారు. అందులోనూ భారత దేశానికి చెందిన వాహన తయారీ సంస్థ మహీంద్ర కంపెనీ ఆటోలను ఇందుకోసం ఉపయోగిస్తుండడం విశేషం...

Mahindra: బ్రిటన్‌లో నేరాల కట్టడికి భారత ఆటోలు.. రంగంలోకి మహీంద్రా ఎలక్ట్రిక్‌ వాహనాలు..
Mahindra Electric Auto

Updated on: Oct 19, 2022 | 6:50 AM

నేరాల కట్టడికి హై ఎండ్‌ ఫీచర్స్‌ ఉన్న పెట్రోలింగ్ వాహనాలను ఉపయోగిస్తారనే విషయం తెలిసిందే. అయితే బ్రిటన్‌లో మాత్రం ఆటోలను ఉపయోగిస్తున్నారు. అందులోనూ భారత దేశానికి చెందిన వాహన తయారీ సంస్థ మహీంద్ర కంపెనీ ఆటోలను ఇందుకోసం ఉపయోగిస్తుండడం విశేషం. బ్రిటన్‌కు చెందిన గ్వెంట్‌ పోలీసులు ఇప్పటికే నాలుగు ఆటోలను ఇందుకోసం తీసుకున్నారు. ఇంతకీ నేరాల కట్టడికి ఆటోలు ఎలా ఉపయోగపడతాయనేగా మీ సందేహం. అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

మహీంద్రా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ ఆటోలను బ్రిటన్‌లో ఉపయోగిస్తున్నారు. పార్కులు, నడక మార్గాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో పెట్రోలింగ్‌కు ఈ ఎలక్ట్రిక్‌ ఆటోలను ఉపయోగించనున్నారు. పౌరులు తమ ఫిర్యాదులను ఈ ఆటోల వద్దకు వచ్చి నమోదు చేసే విధానాన్ని తీసుకొచ్చారు. సేఫ్‌ స్ట్రీట్స్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా బ్రిటన్‌లో ఈ ఆటోలను ప్రవేశ పెట్టినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంపై స్థానికుల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

బ్రిటన్‌లో నేరాలను కట్టడి చేయడానికి తమ వాహనాలను ఉపయోగించడం గర్వందా ఉంటూ మహీంద్రా ఎలక్ట్రిక్‌ ట్వీట్‌ చేసింది. ఇక మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా సైతం ట్విట్టర్‌ వేదికగా ఓ ట్వీట్ చేశారు. భారత్‌కు చెందిన ఆటోలు బ్రిటన్‌లో నేరాల కట్టడికి ఉపయోగిస్తున్నారన్న వార్త అందరినీ ఆకర్షిస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..