Ali Khamenei: అమెరికా సైనిక స్థావరాలపై దాడుల తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్‌ ఖమేనీ కీలక వ్యాఖ్యలు!

తమ దేశంలోని అణుకేంద్రాల టార్గెట్‌గా అమెరికా చేసిన దాడులకు ప్రతీకారంగా ఖతార్‌, ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై తమ సైనికులు చేసిన క్షిపణి దాడులను ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సమర్థించారు. ఈ దాడులు అమెరిగా దాడులకు ప్రతీకారంగా చేసినవేనని తెలిపారు. తాము ఎవరి వేధిపులకు లొంగబోమని తెలిపారు.

Ali Khamenei: అమెరికా సైనిక స్థావరాలపై దాడుల తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్‌ ఖమేనీ కీలక వ్యాఖ్యలు!
Ali Khamnei

Updated on: Jun 24, 2025 | 1:54 AM

మ దేశంలోని అణుకేంద్రాల టార్గెట్‌గా అమెరికా చేసిన దాడులకు ప్రతీకారంగా ఖతార్, ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడుల తర్వాత, సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ అమెరికా స్థావరాలపై దాడులను సమర్థిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. “మేము ఎవరికీ హాని చేయలేదని.. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి నుండి ఎటువంటి వేధింపులను అంగీకరించమని ఆయన పేర్కొన్నారు. అంతే కాదు తాము ఎవరి వేధింపులకు లొంగబోమని .. ఇది ఇరాన్ దేశం తర్కం” అని అతను X వేదికగా పోస్ట్ చేశారు.

అయితే, మొన్న ఇరాన్‌-ఇజ్రాయోల్‌ ఉద్రిక్తతల మధ్య తలదూర్చిన అమెరికా ఇరాన్‌లోని మూడ ప్రధాన అణు స్థావరాలపై వైమానిక దాడులకు పాల్పడింది. అయితే అమెరికా దాడులకు ప్రతీకారంగా సోమవారం ఇరాన్.. ఖతార్, ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులను ప్రయోగించింది. ‘ఆపరేషన్ బెషరత్ ఫతా’ పేరుతో ఈ దాడులను విజయవంతం చేసినట్టు ఇరాన్‌ పేర్కొంది.

ఇరాన్‌ దాడికి పాల్పడిన దోహా వెలుపల ఉన్న అమెరికాకు చెందిన అల్ ఉదీద్ వైమానిక స్థావరంలో సుమారు 10,000 మంది అమెరికాకు చెందిన సైనికులను పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది మధ్యప్రాచ్యంలోనే అతిపెద్ద అమెరికన్ సైనిక స్థావరంగా ఉంది. ఈ సైనిక కేంద్రం ఈ ప్రాంతం అంతటా కార్యకలాపాలకు కీలకమైన కేంద్రంగా పనిచేస్తుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..