Watch Video: పిల్లి కూన అనుకుని పెంచుకుంటే.. చివరికి అసలు విషయం తెలిసి పరేషాన్‌! వీడియో వైరల్

|

Sep 26, 2023 | 7:44 AM

రష్యాకు చెందిన ఓ జంతు ప్రేమికురాలు రోడ్డు పక్కన అచేతనావస్థలో పడి ఉన్న పిల్లి కూనను రక్షించి, ఇంటికి తెచ్చుకుని పెంచుకుంది. అయితే కొన్ని రోజుల తర్వాత అసలు విషయం తెలిసి కంగుతింది. ఎందుకంటే ఆమె పెంచుకుంది పిల్లిని కాదు అక్షరాలా.. చిరుత పులి పిల్ల. ఈ విషయం తెలిసి సదరు యువతి సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. చిరుత, పెట్‌ డాగ్‌తో తనకున్న అనుబంధాన్ని తెలుపుతూ సదరు యవతి షేర్‌ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో..

Watch Video: పిల్లి కూన అనుకుని పెంచుకుంటే.. చివరికి అసలు విషయం తెలిసి పరేషాన్‌! వీడియో వైరల్
Woman Accidentally Raises Black Panther
Follow us on

మాస్కో, సెప్టెంబర్‌ 26: రష్యాకు చెందిన ఓ జంతు ప్రేమికురాలు రోడ్డు పక్కన అచేతనావస్థలో పడి ఉన్న పిల్లి కూనను రక్షించి, ఇంటికి తెచ్చుకుని పెంచుకుంది. అయితే కొన్ని రోజుల తర్వాత అసలు విషయం తెలిసి కంగుతింది. ఎందుకంటే ఆమె పెంచుకుంది పిల్లిని కాదు అక్షరాలా.. చిరుత పులి పిల్ల. ఈ విషయం తెలిసి సదరు యువతి సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. చిరుత, పెట్‌ డాగ్‌తో తనకున్న అనుబంధాన్ని తెలుపుతూ సదరు యవతి షేర్‌ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. మీరూ చూసేయండి..

రష్యాకు చెందిన ఓ యువతి రోడ్డు పక్కన చెట్ల పొదల్లో చిక్కుకున్న నల్ల చిరుత పులి పిల్లను రక్షించింది. అది చూడడానికి అచ్చం పిల్లి పిల్లలా ఉండటంతో పిల్లే అనుకుని తనతోపాటు ఇంటికి తీసుకెళ్లి పెంచుకుంది. తన పెంపుడు కుక్కతో పాటే దానికి ఆహారం అందించి సపర్యలు చేసింది. కానీ అది పెరిగే కొద్దీ దానిలో పిల్లి లక్షణాలు కనిపించకపోవడంతో యువతికి అనుమానం కలిగింది. రోజులు గడిచే కొద్ది అది నల్ల చిరుత (బ్లాక్‌ పాంథర్‌) అని యువతి తెలుసుకుంది. అది చిరుత అయినప్పటికీ తన పెంపుడు కుక్కతోపాటు తనతోనే ఉంచుకుని అనుబంధం పెంచుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

రోడ్డు పక్కన పొదల్లో బ్లాక్‌ పాంథర్‌ దొరికినప్పటి నుంచి అది పెరిగి పెద్దదయి ఆడుకుంటున్న వరకు అన్ని వీడియో క్లిప్‌లను చేర్చి మరో వీడియో తీయారు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అంతే అది కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను సెప్టెంబర్‌ 21న పోస్ట్‌ చేసింది. కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే 10 మిలియన్ల వీక్షణలు, 14 లక్షలకు పైగా కామెంట్లు, లైకులు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు అమితాశ్చర్యలకు గురవుతున్నారు. దాదాపు దీంతో ఆ వీడియోకు తెగ లైక్‌లు వస్తున్నాయి. ఇప్పటికే ఈవీడియోకు మిలియన్లలో వ్యూస్‌ వచ్చాయి. ఆమె తన పెంపుడు కుక్కతోపాటు చిరుతను పెంచింది. మంచి ప్రొటోకాల్‌ నేర్చుకుందంటూ పలువురు పెంపుడు కుక్క, బ్లాక్‌ పాంథర్‌తో ఆమె కున్న అనుబంధాన్ని అభినందిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.