సర్ఫర్‌ స్పీడ్‌.. ఖంగుతిన్న షార్క్‌.

|

Sep 19, 2019 | 5:13 PM

సముద్రంలో షార్క్‌స్పీడ్‌ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే..మనిషి సహా.. దాని ఫుడ్ ఏదైనా సరే..కంట పడిందా..అంతే,.. రెప్పపాటులో ఇట్టేపట్టేస్తుంది. అయితే, ఇక్కడ మాత్రం ఓ షార్క్‌ సర్ఫింగ్‌ చేస్తున్న వ్యక్తిని చూసి తోకముడిచింది. అందేంటో తెలిస్తే..మీరూ ఆశ్చర్యపోతారు..ఇంతకీ అదేలా సాధ్యమైందో తెలుసా.. ఆస్ట్రేలియన్‌ ఫైనాన్షియల్‌ రివ్యూకు సహాయక సంపాదకుడు క్రిస్టోఫర్‌ జాయిస్‌ అనే పరిశోధకుడు సరదాగా ప్రమాదకర ఫీట్లు చేస్తూ సొరచేపల కదలికలను చిత్రీకరిస్తుంటాడు.  ఈ క్రమంలో న్యూసౌత్‌ వేల్లోస్‌లో సముద్రంలో షూట్‌ చేస్తున్నాడు. అదే సమయంలో […]

సర్ఫర్‌ స్పీడ్‌.. ఖంగుతిన్న షార్క్‌.
Follow us on

సముద్రంలో షార్క్‌స్పీడ్‌ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే..మనిషి సహా.. దాని ఫుడ్ ఏదైనా సరే..కంట పడిందా..అంతే,.. రెప్పపాటులో ఇట్టేపట్టేస్తుంది. అయితే, ఇక్కడ మాత్రం ఓ షార్క్‌ సర్ఫింగ్‌ చేస్తున్న వ్యక్తిని చూసి తోకముడిచింది. అందేంటో తెలిస్తే..మీరూ ఆశ్చర్యపోతారు..ఇంతకీ అదేలా సాధ్యమైందో తెలుసా..
ఆస్ట్రేలియన్‌ ఫైనాన్షియల్‌ రివ్యూకు సహాయక సంపాదకుడు క్రిస్టోఫర్‌ జాయిస్‌ అనే పరిశోధకుడు సరదాగా ప్రమాదకర ఫీట్లు చేస్తూ సొరచేపల కదలికలను చిత్రీకరిస్తుంటాడు.  ఈ క్రమంలో న్యూసౌత్‌ వేల్లోస్‌లో సముద్రంలో షూట్‌ చేస్తున్నాడు. అదే సమయంలో మరో వ్యక్తి అక్కడ సర్ఫింగ్‌ చేస్తూ కనిపించాడు.. ఇంతలో ఆయన వైపు  ఓ సొరచేప వేగంగా దూసుకొచ్చింది. డ్రోన్‌ ఆపరేటర్‌ చేస్తున్న క్రిస్టఫర్‌ వెంటనే తన మావిక్  స్పీకర్ ద్వారా ఆ సర్ఫర్‌ను హెచ్చరించాడు. షార్క్‌..షార్క్‌..షార్క్‌ అనే హెచ్చరికల శబ్దాన్ని విన్న సర్పర్‌, షార్క్‌ను గమనించి వేగంగా  వెనుదిరిగాడు.. అయితే సర్పర్‌ వేగాన్ని చూసి షార్క్‌ కూడా భయంతో దూరంగా వెళ్లిపోయింది. క్రిస్టఫర్‌ హెచ్చరిక ఆ సర్ఫర్‌ ప్రాణాలు కాపాడింది. అయితే, గతంలో కూడా తాను చాలా రకాల సొరచేపలను చూశానని, చాలా మంది ప్రాణాలు కాపాడానని చెప్పారు.  గత జులైలో కూడా ఫ్లోరిడా బీచ్‌ లో ఓ తండ్రి బిడ్డలను షార్క్‌ బారి నుంచి కాపాడానని చెప్పారు. కానీ ఇలా సర్ఫ ర్‌ని చూసి భయంతో పారిపోయిన షార్క్‌ను చూడటం ఇదే మొదటి సారి అన్నారు మిస్టర్‌ క్రిస్టఫర్‌ జాయిస్‌.