Virginia: పాఠాలు చెబుతున్న టీచర్‌పై ఆరేళ్ల బాలుడు కాల్పులు.. తన ప్రాణాలు లెక్కచేయకుండా స్టూడెంట్స్ ప్రాణాలు కాపాడే యత్నం చేసిన టీచర్

|

Jan 10, 2023 | 9:26 AM

ఒకటో తరగతి చదువుతున్న ఆ బాలుడు తన తల్లి గన్‌ను స్కూలుకు తీసుకొచ్చాడు. టీచర్‌ అబ్బే వర్నర్‌ పాఠం చెబుతుండగా ఆమెను షూట్‌ చేశాడు. ఈ క్రమంలో బుల్లెట్‌ ఆమె ఛాతిలోకి దూసుకెళ్లింది. అయినా ఆ టీచర్‌ తన ప్రాణాలను లెక్కచేయకుండా మిగతా విద్యార్ధులను కాపాడేందుకు ప్రయత్నించింది.

Virginia: పాఠాలు చెబుతున్న టీచర్‌పై ఆరేళ్ల బాలుడు కాల్పులు.. తన ప్రాణాలు లెక్కచేయకుండా స్టూడెంట్స్ ప్రాణాలు కాపాడే యత్నం చేసిన టీచర్
Abby Zwerner Teacher
Follow us on

ప్రస్తుత కాలంలో క్రైమ్‌ బాగా పెరిగిపోతోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా రెచ్చిపోతున్నారు. తాజాగా నమ్మశక్యం కాని సంఘటన ఒకటి అమెరికాలోని వర్జీనియాలో చోటుచేసుకుంది. క్లాస్‌లో పాఠాలు చెబుతున్న టీచర్‌పై ఆరేళ్ల బాలుడు గన్‌తో కాల్పలు జరిపాడు. ఒకటో తరగతి చదువుతున్న ఆ బాలుడు తన తల్లి గన్‌ను స్కూలుకు తీసుకొచ్చాడు. టీచర్‌ అబ్బే వర్నర్‌ పాఠం చెబుతుండగా ఆమెను షూట్‌ చేశాడు. ఈ క్రమంలో బుల్లెట్‌ ఆమె ఛాతిలోకి దూసుకెళ్లింది. అయినా ఆ టీచర్‌ తన ప్రాణాలను లెక్కచేయకుండా మిగతా విద్యార్ధులను కాపాడేందుకు ప్రయత్నించింది. విద్యార్ధులందరినీ క్లాస్‌రూమ్‌నుంచి బయటకు పంపించేసింది.

ఇంతలో కాల్పుల శబ్ధం విన్న మిగతా టీచర్లు, స్టాఫ్‌ అంతా అక్కడకి చేరుకున్నారు. విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. టీచర్‌ను చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కాల్పులు జరిపిన బాలుడిని అదుపులోకి తీసుకున్నామని, బాలుడు ఉద్దేశపూర్వకంగానే టీచర్‌పై కాల్పులు జరిపినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసు చీఫ్‌ స్టీవ్‌ డ్రోవ్‌ తెలిపారు. టీచర్‌ తన ప్రాణాలు లెక్కచేయకుండా మిగతా పిల్లలను కాపాడిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. టీచర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే సమయంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీచర్‌ త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..