Unique Love Story: ప్రేమకు వయసుతో పనేంటి.. పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడి ప్రేమలో యువతి.. పెద్దల అంగీకారంతో పెళ్లి

|

Jan 12, 2023 | 8:42 AM

ఓ యువకుడు తనకంటే పన్నెండేళ్లు పెద్దదైన అమ్మాయిని ప్రేమించాడు. సమాజం గురించి తనకు పట్టింపు లేదని, తనంటే తనకు ఎంతో ఇష్టమని ఓ యూ ట్యూబ్‌ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్‌గా చెప్పాడు ఆ జూనియర్‌ ప్రేమికుడు.

Unique Love Story: ప్రేమకు వయసుతో పనేంటి.. పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడి ప్రేమలో యువతి.. పెద్దల అంగీకారంతో పెళ్లి
Pakisthan Unique Love Story
Follow us on

ప్రస్తుత కాలంలో ప్రేమకు కుల, మతాలతోనే కాదు వయసుతో కూడా సంబంధం లేదంటున్నారు. కొందరు లేటు వయసులో ఘాటు ప్రేమలో పడితే.. కొందరు తమ కంటే పెద్దవారితో ప్రేమలో పడుతున్నారు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. పాకిస్థాన్‌కు చెందిన ఓ యువకుడు తనకంటే పన్నెండేళ్లు పెద్దదైన అమ్మాయిని ప్రేమించాడు. సమాజం గురించి తనకు పట్టింపు లేదని, తనంటే తనకు ఎంతో ఇష్టమని ఓ యూ ట్యూబ్‌ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్‌గా చెప్పాడు ఆ జూనియర్‌ ప్రేమికుడు.

పాకిస్థాన్‌కు చెందిన ఫాతిమా, ఆదిల్‌ ఒకే ప్రాంతానికి చెందినవారు. ఫాతిమా ఓ రోజు తనను మార్కెట్‌నుంచి కొన్ని సామాన్లు తెచ్చిపెట్టమని కోరిందని, వాటితోపాటు నా మనసు కూడా ఫాతిమాకు ఇచ్చేసానని చెప్పుకొచ్చాడు. అప్పటినుంచి ఆదిల్‌ ప్రతిరోజూ తన ప్రేమను తెలియజేస్తూ ఫాతిమా ఇంట్లోకి ఒక గులాబీ పువ్వును విసిరేవాడినని, చెప్పాడు. తను ఫాతిమాకు ప్రపోజ్‌ చేసినప్పుడు తాను ఆశ్చర్యపోయిందని, తర్వాత తన ప్రేమను అంగీకరించిందని చెప్పాడు. అయితే తమ ప్రేమ విషయమై ఆదిల్‌ తల్లిదండ్రులను ఒప్పించమని ఫాతిమా కోరిందట. మొత్తానికి ఇరువురు కుటుంబ సభ్యులను ఒప్పించి ఇద్దరూ ఒక్కటయ్యారు.

ఆదిల్‌ చాలా మంచి వ్యక్తని, అతని వైఖరి నచ్చడంతో చిన్నవాడైనా అతనితో ప్రేమలో పడ్డానని ఫాతిమా తెలిపింది. తమ పెళ్లి విషయమై ఆదిల్‌ స్నేహితులు చాలా హేళనచేశారని, అయినా తను పట్టించుకోలేదని, తనంటే ఆదిల్‌కు చాలా ఇష్టమని తెలిపింది. ఇక ఫాతిమాకు ఏ పాటను అంకితం చేయాలనుకుంటున్నారని ఆదిల్‌ను అడిగినప్పుడు, అతను 2011 బాలీవుడ్ చిత్రం మర్డర్-2లోని ‘జిస్ రాహ్ పే హై ఘర్ తేరా’ పాటను పాడాడు. కాగా, ఫాతిమా మస్తీ సినిమాలోని ‘దిల్ దే దియా హై, జాన్ తుజే దేంగే’ పాటను హమ్ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..