Boris Johnson – Viral Video: గొడుగుతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కుస్తీ.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో

|

Jul 29, 2021 | 11:07 AM

UK PM Boris Johnson: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఓ అధికారిక కార్యక్రమంలో గొడుగు కారణంగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. రెండ్రోజుల క్రితం నిర్వహించిన పోలీస్ మెమోరియల్ కార్యక్రమంలో

Boris Johnson - Viral Video: గొడుగుతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కుస్తీ.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో
UK PM Boris Johnson
Follow us on

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌(Boris Johnson)కు ఓ అధికారిక కార్యక్రమంలో గొడుగు కారణంగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. రెండ్రోజుల క్రితం నిర్వహించిన పోలీస్ మెమోరియల్ కార్యక్రమంలో బోరిస్ జాన్సన్‌తో పాటు ప్రిన్స్ చార్లెస్, ఇతర ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వర్షం కురుస్తుండటంతో అతిథులు గొడుగులతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సమయంలో బోరిస్ జాన్సన్‌ను గొడుగు తెగ సతాయిస్తూ మూడు చెరువుల నీళ్లు తాగించింది. ముందుగా గొడుగు తెరుచుకోకపోవడంతో బోరిస్ జాన్సన్ దాంతో కుస్తీపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు అతి కష్టం మీద బోరిస్ దాన్ని ఓపన్ చేసి హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత కూడా ఆయనకు గొడుగు కష్టాలు కొనసాగాయి. తెరిసిన కాసేపటికే గొడుగు తనంతట అదిగా మూసుకుపోయింది. బోరిస్ మళ్లీ దాన్ని తెరవగానే.. గాలి తీవ్రత కారణంగా అది తలకిందులయ్యింది.

గొడుగుతో దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ఎదుర్కొంటున్న కష్టాలను చూసిన అతిథులు ఎవరూ నవ్వు ఆపుకోలేకపోయారు. ప్రిన్స్ చార్లెస్ కూడా బోరిస్ పరిస్థితిని చూసి నవ్వేశారు. తనకు గొడుకు కారణంగా ఎదురైన చేదు అనుభవాన్ని దిగమింగుకుంటూ జాన్సన్ కూడా నవ్వు నటించారు. వాస్తవానికి గొడుగు బోరిస్‌ను ఇబ్బందిపెట్టడం 24 గంటల వ్యవధిలో ఇది రెండోసారి. అంతకు ముందు సర్వే కార్యక్రమంలోనూ బోరిస్ జాన్సన్‌కు గొడుగుతో ఇలాంటి తిప్పలే ఎదురయ్యాయి. దేశ ప్రధాని వర్షంలో తడిసిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

గొడుకుతో బోరిస్ జాన్సన్ ఇబ్బందులు పడుతున్న ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్స్ కూడా దీనిపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. గొడుగును ఎలా వాడుకోవాలో బోరిస్‌ ట్రైనింగ్ కోర్స్ తీసుకుంటే మంచిదని ఓ నెటిజన్ ఉచిత సలహా ఇచ్చాడు. గత రెండ్రోజులుగా గొడుగుతో బోరిస్ ఇబ్బందులుపడుతున్నట్లు ఆ నెటిజన్ తన ట్వీట్‌లో గుర్తుచేశాడు. అటు బ్రిటన్ మీడియాలోనూ బోరిస్ గొడుగు కష్టాలు పతాక శీర్షికలకెక్కింది.

Also Read..

 సహజశత్రువులకు ఆపధర్మంగా ఉపకారం చేయవచ్చు.. కానీ ఎప్పటికీ స్నేహం చేయకూడదు..

 వ్యాక్సిన్ వేయించుకో..టెస్లా కారు తీసుకుపో..టీకా పై ఆఫర్ల వర్షం..బారులు తీరిన జనం ఎక్కడంటే..

తాలిబన్లకు చైనా మద్దతు..ఆఫ్ఘనిస్తాన్ లో ఏం జరగబోతోంది .? అమెరికా దారెటు ..?