Viral Video: ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ను తాకిన ఇజ్రాయెల్‌ క్షిపణులు… ఆకాశాన్ని కమ్ముకున్న దట్టమైన పొగలు

ఇరాన్- ఇజ్రాయెల్ వార్ మరింత ముదురుతోంది. రెండు దేశాల మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు భయపడమని ఆదేశ ఆర్మీ కమాండర్ తెలిపారు. అనడమేకాదు ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇరాన్‌ క్షిపణులను...

Viral Video: ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ను తాకిన ఇజ్రాయెల్‌ క్షిపణులు... ఆకాశాన్ని కమ్ముకున్న దట్టమైన పొగలు
Israels Ashdod Idf Strikes

Updated on: Jun 23, 2025 | 7:14 PM

ఇరాన్- ఇజ్రాయెల్ వార్ మరింత ముదురుతోంది. రెండు దేశాల మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు భయపడమని ఆదేశ ఆర్మీ కమాండర్ తెలిపారు. అనడమేకాదు ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇరాన్‌ క్షిపణులను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కొన్ని క్షిపణులు ఇజ్రాయెల్‌ భూభాగాన్ని తాకుతున్నాయి.

ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను ముందే గుర్తిస్తున్న ఇజ్రాయెల్ ప్రజలకు సందేశాల ద్వారా హెచ్చరిస్తోంది. సైరన్ మోగించి బంకర్లలోకి వెళ్లాలని సూచిస్తోంది. ఇరాన్ ప్రయోగిస్తున్న బాలిస్టిక్, హైపర్ సోనిక్ క్షిపణులను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తోంది. ఇజ్రాయెల్ కొన్నింటిని ఆకాశంలో అడ్డుకుని పేల్చివేయడంతో కొన్ని శకలాలు ఇళ్లపై పడుతున్నాయి. ప్రజలు అప్పటికే బంకర్లలోకి చేరుకోవడంతో వారు సురక్షితంగా ఉంటున్నారు.

మరోవైపు పశ్చిమ ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఇజ్రాయెల్ దాడులు చేసింది. 30కిపైగా క్షిపణులు ప్రయోగించింది. 6 ఎయిర్ బేస్‌లపై దాడిచేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఉత్తర భాగంలో ఇజ్రాయెల్ దాడుల ఫలితంగా దట్టమైన పొగలు లేచాయి. రెండు దేశాల మధ్య యుద్ధం తీవ్రంగా మారింది. పరస్పర దాడులతో ఇరువైపులా భారీ నష్టం సంభవిస్తోంది.

వీడియో చూడండి: