Video Viral: వినూత్నంగా ఆలోచించి ఓ యువకుడు గిన్నిస్ రికార్డ్.. ఐదు కార్ల మీద నుంచి సునాయాసంగా జంప్.. వీడియో వైరల్..

|

Nov 19, 2021 | 1:02 PM

Video Viral: గిన్నిస్ రికార్డ్ లో చోటు సంపాదించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది తమ అభిరుచికి పదును పెట్టి.. తమ ప్రతిభను వెలికి తీస్తే.. మరికొందరు..

Video Viral: వినూత్నంగా ఆలోచించి ఓ యువకుడు గిన్నిస్ రికార్డ్.. ఐదు కార్ల మీద నుంచి సునాయాసంగా జంప్.. వీడియో వైరల్..
Viral Video
Follow us on

Video Viral: గిన్నిస్ రికార్డ్ లో చోటు సంపాదించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది తమ అభిరుచికి పదును పెట్టి.. తమ ప్రతిభను వెలికి తీస్తే.. మరికొందరు మొక్కలు పెంపకం.. తినడం, నిద్ర పోవడం ఇలా అనేక పనులతో అందరినీ ఆకర్షిస్తారు. ఇలా ప్రతి సంవత్సరం రకరకాల ఫీట్స్ చేసి చాలామంది వ్యక్తులు గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదిస్తున్నారు. ఇలా గిన్నిస్‌ రికార్డ్‌ సాధించాలనుకున్న ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. కార్లపైనుంచి గెంతితే ఎలా ఉంటుంది అనుకున్నాడు.. అనుకోవడమేంటి.. గెంతేసాడు కూడా.. ఏకంగా 5 కార్లపైనుంచి సునాయాసంగా ఒక స్టిక్‌ సాయంతో జంప్‌ చేసేసాడు. అందుకే గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో అత్యధిక కార్లపైనుంచి ఒకే సమయంలో గెంతిన వ్యక్తిగా ఇతని పేరు నమోదు చేసుకోగలిగాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

టైలర్‌ పిలిప్స్‌ అనే ఈ వ్యక్తి పోగో స్టిక్‌ సాయంతో ఇలా కార్లపైనుంచి దూకి రికార్డ్‌ నెలకొల్పాడు. ఈ పోగో స్టిక్‌ను చిన్న చిన్న జంపిగ్స్‌కోసం ఉపయోగిస్తారు. రెండు భాగాలుగా ఉండే ఈ కర్ర క్రింది పార్ట్‌లో స్ప్రింగ్‌ ఉంటుంది. పై భాగంలో కాళ్లు పెట్టుకోడానికి, చేతులతో పట్టుకోడానికి వీలుగా ఏర్పాట్లు ఉంటాయి. ఈ కర్రపైకి ఎక్కి.. స్ప్రింగ్ ద్వారా గెంతుతూ వెళ్తారు. నిజానికి ఇది పిల్లలు ఆడుకునే టాయ్‌ స్టిక్‌.. ప్రొఫెషనల్‌ క్రీడాకారులు దీన్ని ఆక్రోబాటిక్ స్టంట్స్‌కి ఉపయోగిస్తారు. అలాంటి స్టిక్స్‌లో మంచి బలమైన పెద్ద కర్రను ఫిలిప్‌ తన ఫీట్‌ కోసం ఉపయోగించాడు. ఇంక కార్లు ఒక్కోటీ 2 మీటర్ల పొడవు, 1.6 మీటర్ల వెడల్పు ఉన్నాయి. 21 ఏళ్ల ఫిలిప్స్ ఇలా జంప్ చెయ్యడంలో ఎక్స్‌పర్ట్. కాబట్టే అంత ఈజీగా గెంతాడు. చివరి కారు దగ్గర అతను గిర్రున తిరగడం చూస్తే అతని టాలెంట్‌ని మెచ్చుకోక మానరు. ఈ ఫీట్ చూసి నెటిజన్లు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫిలిప్స్‌ చాలా బాగా చేశాడనీ.. పోగో స్టిక్‌ని పర్ఫెక్టుగా వాడేశాడంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

Also Read:  నాన్ స్టిక్ తవా కంటే ఇనుప పెనమే బెస్ట్ అంటున్న హెల్త్ ఎక్స్‌పెర్ట్స్.. వివరాలు

ఐలాండ్‌లో పీతల దండు.. కోట్లలో రోడ్ల మీదకు వచ్చిన పీతలు.. భయాందోళనలో ప్రజలు