Pet Dog: Pet Dog: చిన్నారిని నిద్రలేపిన కుక్క.. డిస్టర్బ్ చేస్తుందనుకున్న తల్లిదండ్రులు.. తీరా చూస్తే..

Pet Dog: పెంపుడు జంతువులు తమ యజమాని పట్ల.. అతని కుటుంబం పట్ల ఎంతో ప్రేమని కలిగి ఉంటాయని అనేక సంఘటనలు మనకు రుజువు చేశాయి. తాజాగా ఓ ట్విటర్ యూజర్ తమ కుక్క తమ..

Pet Dog: Pet Dog: చిన్నారిని నిద్రలేపిన కుక్క.. డిస్టర్బ్ చేస్తుందనుకున్న తల్లిదండ్రులు.. తీరా చూస్తే..
Pet Dog
Follow us
Surya Kala

|

Updated on: Dec 16, 2021 | 12:32 PM

Pet Dog: పెంపుడు జంతువులు తమ యజమాని పట్ల.. అతని కుటుంబం పట్ల ఎంతో ప్రేమని కలిగి ఉంటాయని అనేక సంఘటనలు మనకు రుజువు చేశాయి. తాజాగా ఓ ట్విటర్ యూజర్ తమ కుక్క తమ చిన్నారి  ప్రాణాన్ని ఎలా కాపాడిందో పంచుకున్నాడు. కెల్లీ ఆండ్రూ  అనే మహిళ.. తమ కుక్క నర్సరీలోకి వచ్చి.. బిడ్డను మేల్కొలపడానికి ప్రయత్నిస్తుందని.. అప్పుడు తాము కుక్క అలా ఎందుకు చేస్తుందో అర్ధం చేసుకోలేక పోయామని తెలిపింది. అంతేకాదు కుక్క అలా తన పాపని నిద్రలేపుతుంటే తనకు చాలా కోపం కూడా వచ్చిందని కెల్లీ చెప్పింది. అయితే తమకు కొంచెం సేపటి అర్ధం అయింది. తమ పాప శ్వాస తీసుకోవడంలేదని.. అందుకనే కుక్క తన పిల్లని లేపడానికి ప్రయత్నిస్తుందని అర్ధం అయింది. వెంటనే మేము స్పందించి.. చిన్నారిని ఆస్పత్రికి తీసుకుని వెళ్లాము.. రాత్రి అంతా మేము పాపతో పాటు ఆస్పత్రిలోనే ఉన్నామని చెప్పింది.

అయితే అసలు కుక్క కనుక చిన్నారిని నిద్ర లేపడానికి ప్రయత్నించకపోతే.. ఏమి జరిగేదో ఊహించడానికి కూడా భయంగా ఉందని చెప్పారు. ఈరోజు నా పాపకు ప్రాణం పోసింది… తమ పెంపుడు కుక్క అంటూ సోషల్ మీడియా వేదికగా తమ అనుభవాన్ని తల్లిదండ్రులు పంచుకున్నారు.

ఈ ట్విట్ ను 5,000 సార్లు రీట్వీట్ చేశారు.  69,000 లైక్స్ ను సొంతం చేసుకుంది. నెటిజన్ల హృదయాలను తాకింది. చాలా మంది కుక్కని చిన్నారి ప్రాణాలు కాపాడిన దైవంగా పోలుస్తూ కామెంట్స్ చేశారు.

Also Read:  చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నరవాణే.. డిసిప్లిన్డ్ అధికారిగా మంచి పేరు