Viral News: కోమా నుంచి మేల్కొన్న ముగ్గురు పిల్లల తల్లి.. నాకు 15 ఏళ్లు అంటూ షాకింగ్ కామెంట్స్.. మా అమ్మ ఉంది చాలు గుర్తుపట్టకపోయినా ఒకే అంటున్న పిల్లలు

|

Aug 08, 2023 | 11:50 AM

కత్రినా ఓ'నీల్ కోమా నుంచి మెలకువ వచ్చిన తర్వాత అంటే 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వరకు తన జీవితంలో ఏం జరిగిందో తనకు గుర్తులేదని చెప్పింది. ఆ మహిళ రాబర్ట్ గావ్ అనే డాక్యుమెంటరీ మేకర్‌తో మాట్లాడుతూ.. గత 14 సంవత్సరాల్లో ఏమి జరిగిందో తనకు ఏమీ గుర్తురాకపోవడంతో తాను చాలా గందరగోళానికి గురయ్యానని చెప్పింది. ఎంతగా అంటే కత్రినా తనకు పుట్టిన ముగ్గరు పిల్లల పుట్టుక గురించి కూడా మరిచిపోయింది.

Viral News: కోమా నుంచి మేల్కొన్న ముగ్గురు పిల్లల తల్లి.. నాకు 15 ఏళ్లు అంటూ షాకింగ్ కామెంట్స్.. మా అమ్మ ఉంది చాలు గుర్తుపట్టకపోయినా ఒకే అంటున్న పిల్లలు
Katrina O'neil
Image Credit source: CBC
Follow us on

ఒక మహిళకు బేస్ బాల్ ఆడుతున్న సమయంలో ఆమెకు గుండెపోటు వచ్చింది. దాదాపు 22 నిమిషాల పాటు ఆక్సిజన్ అందకపోవడంతో ఆ మహిళ ఇబ్బంది పడింది. దీంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ఆమె కోమా నుంచి తేరుకుంటుందని ఆశగా కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. అయితే కోమా నుంచి లేచిన వెంటనే మహిళ చెప్పిన మాటలు విని కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు. తనకు పెళ్లయిందని, ముగ్గురు పిల్లల తల్లినని అంగీకరించేందుకు ఆ మహిళ సిద్ధంగా లేదు. అంతే కాదు తన కుటుంబం సభ్యులను, స్నేహితులను కూడా గుర్తించలేదు. అసలు వారిని గుర్తు చేసుకోవడానికి ఆ మహిళ ఇష్టపడలేదు. చాలా   సున్నితంగా నిరాకరించింది. ఈ వింత ఘటన కెనడాలో చోటు చేసుకుంది.

కెనడాలోని అంటారియోకు చెందిన 29 ఏళ్ల కత్రినా ఓ’నీల్ కోమా నుండి బయటపడ్డ తర్వాత ఆమె ప్రవర్తన వింతగా ఉంది. అంతేకాదు ప్రతి విషయంలోనూ చిరాకు పడటం ప్రారంభించింది. తన ఫ్యామిలీపై కోపం తెచ్చుకోవడం ప్రారంభించింది. ఎందుకంటే.. కత్రినా ఓ’నీల్ తన వయస్సు 15 సంవత్సరాలుగా భావించింది. అంతేకాదు తనకు అక్కడ ఉన్నవారు ఎవరో కూడా తెలియదని  చెప్పింది.

మహిళలపై డాక్యుమెంటరీ

కత్రినా ఓ’నీల్ కోమా నుంచి మెలకువ వచ్చిన తర్వాత అంటే 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వరకు తన జీవితంలో ఏం జరిగిందో తనకు గుర్తులేదని చెప్పింది. ఆ మహిళ రాబర్ట్ గావ్ అనే డాక్యుమెంటరీ మేకర్‌తో మాట్లాడుతూ.. గత 14 సంవత్సరాల్లో ఏమి జరిగిందో తనకు ఏమీ గుర్తురాకపోవడంతో తాను చాలా గందరగోళానికి గురయ్యానని చెప్పింది. ఎంతగా అంటే కత్రినా తనకు పుట్టిన ముగ్గరు పిల్లల పుట్టుక గురించి కూడా మరిచిపోయింది. ఆ మహిళ కథ ఇప్పుడు ‘లాసింగ్ యువర్ సెల్ఫ్’ అనే కొత్త డాక్యుమెంటరీగా తెరకెక్కింది.

ఇవి కూడా చదవండి

ఇలా ఎందుకు జరిగిదంటే..

CBC న్యూస్ రిపోర్ట్ ప్రకారం.. కత్రినాకు ఎదురైన పరిస్థితి చాలా అరుదు.. ఇంకా చెప్పాలంటే ఇలాంటివి సినిమాల్లో చూడడమే కాదు.. నిజ జీవితంలో కనీవినీ ఎరుగనిదని టొరంటోలోని బేక్రెస్ట్ సెంటర్‌లోని రోట్‌మన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లోని న్యూరాలజిస్ట్, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ హోవార్డ్ చెర్ట్‌కో చెప్పారు. చెర్ట్కో బక్కే ప్రకారం చాలా సందర్భాల్లో ఆక్సిజన్ కొరత కారణంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడవచ్చు అని అన్నారు. మెదడుకి ఆక్సిజన్ సరఫరా ఆగినప్పుడు ఆమ్లంగా మారుతుంది. ఇది pH స్థాయిని తగ్గిస్తుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ పరిస్థితిని వైద్య శాస్త్రంలో ‘హిప్పోకాంపస్’ అంటారు. ఇది చాలా సున్నితమైన సమస్య. కణాలు పనిచేయడం ఆగిన వెంటనే కొన్ని నిమిషాల్లో మనిషి చనిపోతాడు. అయితే ఇక్కడ సంతోషకరమైన విషయం ఏమిటంటే.. కత్రినా జ్ఞాపకాలు కొన్ని మెల్లగా తిరిగి వస్తున్నాయి. కోమా నుంచి బయటకు వచ్చిన ఆమె ఇప్పుడిప్పుడే  కొన్ని విషయాలను నేర్చుకుంటుంది.

తానూ ఎవరో కుటుంబ సభ్యులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని.. తనకు చాలా కథలు చెప్పారని ఆ మహిళ చెప్పింది.కానీ తనకు ఏమీ గుర్తు లేదు. అయితే తన పరిస్థితిని అర్ధం చేసుకుని ఎంతో బాగా చూసుకుంటున్న  పిల్లలు పుట్టడం తన అదృష్టమని ఆ మహిళ చెబుతోంది. పిల్లలు కూడా తమ తల్లి తనతోనే ఉందని.. అది చాలు మాకు అంటూ సంతోషిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..