48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే నాశనం చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

గల్ఫ్‌ వార్‌తో గ్లోబంతా గజగజా వణికిపోతోంది. 22 రోజులు గడిచిపోయాయి. గల్ఫ్‌ వార్‌.. నాలుగో వారంలోకి ఎంటర్‌ అయింది. దీనికి ఎండ్‌కార్డ్ పడే సూచనలు ఇప్పుడప్పుడే కనిపించడం లేదు. యుద్ధంలో పాల్గొంటున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ దేశాల సంగతేమో గానీ, ప్రపంచం మొత్తం లబోదిబోమంటోంది. గల్ఫ్ యుద్ధం దెబ్బకు ప్రపంచ దేశాల బతుకు చిత్రం మారిపోతోంది.

48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే నాశనం చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
Us President Donald Trump Strong Warns Iran

Updated on: Mar 22, 2026 | 7:39 AM

గల్ఫ్‌ వార్‌తో గ్లోబంతా గజగజా వణికిపోతోంది. 22 రోజులు గడిచిపోయాయి. గల్ఫ్‌ వార్‌.. నాలుగో వారంలోకి ఎంటర్‌ అయింది. దీనికి ఎండ్‌కార్డ్ పడే సూచనలు ఇప్పుడప్పుడే కనిపించడం లేదు. యుద్ధంలో పాల్గొంటున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ దేశాల సంగతేమో గానీ, ప్రపంచం మొత్తం లబోదిబోమంటోంది. గల్ఫ్ యుద్ధం దెబ్బకు ప్రపంచ దేశాల బతుకు చిత్రం మారిపోతోంది. ముడి చమురు, గ్యాస్‌ కష్టాలు మొదలవడంతో, ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు అలుముకున్నాయి. చిన్నచిన్న దేశాలు వీధినపడే పరిస్థితి వచ్చింది. అటు అగ్రరాజ్యం అమెరికాని కూడా గ్యాస్‌, పెట్రోల్‌ సెగ తాకింది. అమెరికాలో పెట్రోల్‌ ధరలు పెరగడంతో, ట్రంప్‌, నెతన్యాహులకు జాయింట్‌గా శాపనార్ధాలు పెడుతున్నారు జనం. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా.. ఇరాన్‌కు హెచ్చరిక జారీ చేసింది. 48 గంటల్లోగా ఇరాన్ హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే, అమెరికా దాని అనేక విద్యుత్ ప్లాంట్లపై దాడి చేసి ధ్వంసం చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అతిపెద్ద ప్లాంట్‌తోనే ఈ దాడిని ప్రారంభిస్తామని అమెరికా స్పష్టంగా పేర్కొంది.

ట్రూత్ సోషల్ అనే బ్లాగ్‌లో డొనాల్డ్ ట్రంప్ పెట్టిన ఒక పోస్ట్‌లో, ఇరాన్ దళాలు పూర్తిగా దిగ్బంధించిన కీలకమైన మార్గాన్ని తెరవాలని ట్రంప్ ఇరాన్‌ను కోరారు. “ఎటువంటి బెదిరింపులు లేకుండా 48 గంటలలోపు ఇరాన్ హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే, అమెరికా దాడి చేసి, అతిపెద్ద వాటితో మొదలుపెట్టి వారి విద్యుత్ ప్లాంట్లను పూర్తిగా ధ్వంసం చేస్తుంది.” అని పేర్కొన్నారు. తన లక్ష్యాలు అనుకున్న సమయానికంటే ముందే నెరవేరాయని కూడా ఆయన పేర్కొన్నారు.

హోర్ముజ్ జలసంధిలో నౌకాయానానికి ఇరాన్ ముప్పు పొంచి ఉండటంతో చమురు ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదవ వంతు ప్రయాణించే ఈ జలమార్గమైన హోర్ముజ్ జలసంధిని స్థిరీకరించకుండానే, కొనసాగుతున్న సంఘర్షణ నుండి అమెరికా వైదొలగవచ్చని ఆ రిపబ్లికన్ అధ్యక్షుడు శుక్రవారం సూచించారు.

ట్రంప్ మీడియాను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన ప్రత్యేకంగా డేవిడ్ సాంగర్‌ను ప్రస్తావిస్తూ, అమెరికా తన లక్ష్యాలను సాధించడంలో విఫలమైందని తప్పుగా వాదిస్తున్నారని అన్నారు. అమెరికా తన లక్ష్యాలన్నింటినీ సాధించింది. ఇరాన్ నాయకత్వం కుప్పకూలింది, దాని నౌకాదళం, వైమానిక దళం ఇకపై ఉపయోగపడకుండగా చేశాం, ఆ దేశానికి బలమైన భద్రతా వ్యవస్థ కొరవడిందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ఇప్పుడు చర్చలు కోరుకుంటోందని, కానీ తాను మాత్రం ఎలాంటి ఒప్పందం చేసుకోవడానికి ఇష్టపడటం లేదని ట్రంప్ అన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us