శాంతి రాయబారిగా చెప్పుకుంటున్న పాకిస్థాన్ బండారాన్ని బయటపెట్టిన డొనాల్డ్ ట్రంప్..!

ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేశారు. అమెరికా యుద్ధనౌకలపై టెహ్రాన్ ప్రయోగించిన 100కు పైగా క్షిపణులు పాకిస్తాన్ ద్వారానే వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్షిపణుల వెనుక చైనా ఉందని, పాకిస్తాన్ ద్వారా వాటిని ఇరాన్‌కు సరఫరా చేసిందని ఆయన ఆరోపించారు.

శాంతి రాయబారిగా చెప్పుకుంటున్న పాకిస్థాన్ బండారాన్ని బయటపెట్టిన డొనాల్డ్ ట్రంప్..!
Donald Trump New Revelations China And Pakistan

Updated on: Apr 09, 2026 | 6:04 PM

ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేశారు. అమెరికా యుద్ధనౌకలపై టెహ్రాన్ ప్రయోగించిన 100కు పైగా క్షిపణులు పాకిస్తాన్ ద్వారానే వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్షిపణుల వెనుక చైనా ఉందని, పాకిస్తాన్ ద్వారా వాటిని ఇరాన్‌కు సరఫరా చేసిందని ఆయన ఆరోపించారు. అయితే, అమెరికా నౌకాదళం ఈ క్షిపణులను విజయవంతంగా అడ్డుకుందని ట్రంప్ అన్నారు.

అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన ఒక రోజు తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేయడం సంచలనంగా మారింది. అయితే, కాల్పుల విరమణ ప్రకటంచిన కొన్ని గంటల్లోనే పరిస్థితి మళ్లీ క్షీణించింది. ఇరాన్‌లోని ఒక రిఫైనరీపై దాడి జరిగినట్లు, అలాగే కువైట్, బహ్రెయిన్‌లపై ఇరాన్ దాడులు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. అదే సమయంలో, ఇజ్రాయెల్ సైతం లెబనాన్‌పై వరుస క్షిపణి దాడులు జరిపింది. ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణను మరింత బలహీనపరిచింది.

ఇదిలావుంటే, మరోసారి రికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వార్నింగ్ ఇచ్చారు. సలైన ఒప్పందం కుదిరే వరకు.. ఇరాన్ చుట్టుపక్కల అమెరికా సైన్యం మోహరింపు కంటిన్యూ అవుతుందని తేల్చి చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందం పాటించకపోతే, గతంలో ఎన్నడూ చూడని భీకర దాడులు తప్పవంటూ ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ హెచ్చరించారు.

తదనంతరం ఇరాన్, వ్యూహాత్మకంగా కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామని బెదిరించింది. అలాగే, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆగకపోతే కాల్పుల విరమణకు అర్థం ఉండదని పేర్కొంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా, ఇజ్రాయెల్ ‘మిషన్ అసంపూర్ణంగా ఉందని’, లెబనాన్‌లో కార్యకలాపాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఎందుకంటే ఇది కాల్పుల విరమణ ఒప్పందంలో భాగం కాదన్నారు.

అయితే, హోర్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయలేదని, పౌర నౌకలకు తెరిచి ఉందని ఇరాన్ గురువారం (ఏప్రిల్ 09) స్పష్టం చేసింది. ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి ఈ మేరకు ప్రకటన చేశారు. దానిని మూసివేశారన్న వార్తలు అవాస్తవమన్నారు. అయినప్పటికీ, ప్రస్తుత యుద్ధ వాతావరణం దృష్ట్యా, దాని గుండా వెళ్లే అన్ని చమురు, వాణిజ్య నౌకలు ఇకపై క్షుణ్ణమైన తనిఖీ, పరిశీలన ప్రక్రియలకు లోబడి ఉంటాయని తెలిపారు.

మరోవైపు, ఇరాన్ అధికారుల నుండి ముందస్తు అనుమతి ఉన్న ఓడలను మాత్రమే ముందుకు వెళ్లడానికి అనుమతిస్తున్నారు. సాంకేతికంగా మార్గం తెరిచే ఉన్నప్పటికీ, కఠినమైన నిఘా, భద్రతా తనిఖీలు రాకపోకలను గణనీయంగా పరిమితం చేశారు. ఇది ప్రపంచ చమురు సరఫరాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. తీవ్రమైన ఆరోపణలు, ప్రత్యారోపణలు, కొనసాగుతున్న సైనిక చర్యలతో, మధ్యప్రాచ్యంలో పరిస్థితి అత్యంత పెళుసుగా మారిపోయాయి. ఉద్రిక్తతలు ఏ క్షణంలోనైనా ఒక పెద్ద సంఘర్షణగా మారవచ్చని స్పష్టం చేస్తున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us