US police: అమెరికాలో మరో దారుణం వెలుగు చూసింది. ఓ పోలీసు అధికారి రెచ్చిపోయారు. తొమ్మిదేళ్ల అమ్మాయికి సంకెళ్లు వేసి పోలీసుల జీపులో తరలించారు. అంతేకాదు.. బాలికను అదుపులోకి తీసుకునే సమయంలో కారులోపలికి కాలు పెట్టాలంటూ అతను చేసిన ఆదేశాలను బాలిక పాటించకపోవడంతో ఆమెపై పెప్పర్ స్ప్రే చల్లారు. దాంతో బాలిక అమ్మా, నాన్నా అంటూ ఆర్తనాదాలు చేసింది. అమెరికాలోని రోచెస్టర్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ హృదయ విదారక ఘటన తాలూకు దృశ్యాలన్నీ పోలీసు అధికారి బాడీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. తాజాగా ఆ వీడియో బయటకు రావడంతో అదికాస్తా వైరల్ అయ్యింది. దాంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.
అమెరికా పోలీసుల తీరుపై మరోసారి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ ఘటనపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు.. పోలీసుల చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. బాలిక అరెస్ట్‌కు సంబంధించిన నేపథ్యాన్ని విరించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ‘సదరు బాలిక ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది, అంతేకాదు.. తన తల్లిని కూడా చంపాలని ప్రయత్నించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగానే అమ్మాయిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.’ అని తెలిపారు.
Also read:
Uppena Trailer: నందమూరి హీరో చేతుల మీదుగా విడుదలకానున్న… మెగా హీరో సినిమా ట్రైలర్..?
Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరం నిర్మాణం… భారీ మొత్తంలో విరాళం ప్రకటించిన ముఖ్యమంత్రి..