అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కి బెదిరింపులు, ఫ్లోరిడాకు చెందిన నర్సు అరెస్ట్

| Edited By: Phani CH

Apr 18, 2021 | 11:24 AM

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ను హతమారుస్తానంటూ బెదిరించిన ఓ నర్సును పోలీసులు అరెస్టు చేశారు. ఫ్లోరిడాకు చెందిన ఈమెను నివియన్ పెటిట్ హెల్ప్స్ గా గుర్తించారు.

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కి బెదిరింపులు, ఫ్లోరిడాకు చెందిన నర్సు అరెస్ట్
US Vice President Kamala Harris (File Photo)
Follow us on

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ను హతమారుస్తానంటూ బెదిరించిన ఓ నర్సును పోలీసులు అరెస్టు చేశారు. ఫ్లోరిడాకు చెందిన ఈమెను నివియన్ పెటిట్ హెల్ప్స్ గా గుర్తించారు. 39 ఏళ్ళ ఈ నర్సు.. 2001 నుంచి జాక్సన్ హెల్త్ సిస్టం హాస్పిటల్ లో పని చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. గత ఫిబ్రవరి 13-18 తేదీల మధ్య నివియన్.. కమలా హారిస్ కు భౌతికంగా హాని చేస్తానని, హతమారుస్తానని  బెదిరించిందట. తొలి బ్లాక్ వుమన్, మొట్టమొదటి దక్షిణాసియన్ అమెరికన్ అయిన 56 ఏళ్ళ కమలా హారిస్ కు ఒక నర్సు నుంచి ఈ విధమైన బెదిరింపులు అందడం ఆశ్చర్యకరమని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న తన భర్తకు నివియన్  ఈ మేరకు వీడియో మెసేజ్ లు పంపినట్టు వారు చెప్పారు.

అధ్యక్షుడు జోబైడెన్  పట్ల, కమలా హారిస్ పట్ల ద్వేష పూరిత వ్యాఖ్యలు చేసిన ఈ నర్సు వ్యవహారం పోలీసులకు అంతుబట్టడంలేదు. బహుశా జాతి వివక్షతో ఇలా ఈమె హారిస్ ను బెదిరించి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ రోజు నుంచి 50 రోజుల్లోగా మిమ్మల్ని చంపుతానని హెల్ప్స్..ఫిబ్రవరి 18 న తన వీడియో మెసేజ్ లో హారిస్ ను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చింది. ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు మీరు మీ చేతిని బైబిల్ పై పెట్టేబదులు మీ క్లచ్ పర్సుపై పెట్టారని ఈ నర్సు  తన హెచ్చరికలో ఆరోపించింది. ఇది అగౌరవ సూచకమని పేర్కొంది. ఇంకా ఓ పిస్టల్ పట్టుకుని ఓ షూటింగ్ రేంజ్ లో హెల్ప్స్ చేసిన హంగామా తాలూకు ఫోటోను పోలీసులు గమనించారు. ఆయుధాలను రహస్యంగా  దాచుకునేందుకు తనకు  లైసెన్స్ ఇవ్వాలని కూడా అధికారులను ఈమె కోరిందట.   మార్చి 3 న పోలీసులు, డిటెక్టివ్ లు ఈమె ఇంటికి వెళ్లినప్పుడు వారితో మాట్లాడేందుకు ఫెల్ప్స్ నిరాకరించిందని, అయితే ఆ తరువాత మళ్ళీ వారు ఆమె ఇంటికి వెళ్లగా తన యవ్వారం ముగిసిందని భయపడిన ఈ నర్సు తనకు ఇప్పుడు కమలా హారిస్ అంటే ద్వేషం లేదని చెప్పినట్టు తెలిసింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ఐఏఎస్ చదివే యువకుడు అకస్మాత్తుగా సూసైడ్.. విచారణలో పోలీసులకు మైండ్ బ్లాంక్.. వామ్మో ఏం స్కెచ్

Remdesivir Injections: ప్రభుత్వాస్పత్రిలో 860 రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు మాయం.. ప్రభుత్వం సీరియస్.. వారి పనే అని అనుమానం..!