తిత్తి తీస్తామంటున్న డెమొక్రాట్లు.. ఇన్వెస్టర్ల గుండెల్లో రాళ్లు.. ఏఐ డేటా సెంటర్లకు అమెరికాలో చిత్తడేనా..?

అమెరికాలో ప్రభుత్వం మారకపోయినా, పెత్తనం మారింది. మిడ్‌టర్మ్ ఫలితమొచ్చి ట్రంప్ మొహమ్మీద గట్టిగానే బాదేసింది. కానీ రిపబ్లికన్ల నెత్తినెక్కి, మాంచి ఊపు మీదున్న డెమొక్రాట్లు ఎప్పటికప్పుడు టార్గెట్లు మార్చుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ల ఫస్ట్‌ ఛాలెంజ్ అధ్యక్షుడు కాదట, కృత్రిమ మేథస్సుడు. మధ్యంతర ఎన్నికల తర్వాత ఆర్టిఫీషియల్ రెవెల్యూషన్ ఎలా రంగు మారుతోందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

తిత్తి తీస్తామంటున్న డెమొక్రాట్లు.. ఇన్వెస్టర్ల గుండెల్లో రాళ్లు.. ఏఐ డేటా సెంటర్లకు అమెరికాలో చిత్తడేనా..?
Us Midterm Election Results Ai Impact

Updated on: Nov 06, 2026 | 9:36 PM

అమెరికాలో ఏఐ బూమ్.. ఎలక్షన్ రిజల్ట్‌నే శాసించిందా? డేటా సెంటర్ల పిచ్చే ట్రంప్ కొంప ముంచిందా? ఏఐతో లాభం కంటే నష్టమే ఎక్కువన్న ఇంగితాన్ని మరిచి, డేటా సెంటర్లను వేలంవెర్రిగా ఎంకరేజ్ చేసినందుకే ట్రంప్ జమానా భారీ మూల్యం చెల్లించుకుంటోందా? AI మీద మొహం మొత్తినందుకే అమెరికన్ ఓటర్ ఇలా తిరగబడ్డాడా? ఔను.. ఉభయసభల్లో నంబర్స్ పెంచుకుని ఫుల్ చార్జింగ్‌తో ఊపు మీదున్న డెమొక్రాట్లకు ఫస్ట్ టార్గెట్ ఏంటో తెలుసా? ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌కి రెక్కలు విరగ్గొట్టడం. ప్రజాతీర్పును గౌరవించి, వాళ్లు కోరుకున్నట్టు AIకి కోరలు బిగించాల్సిందే అని సీనియర్ డెమొక్రాట్లు ఓ నిర్ణయానికే వచ్చినట్టున్నారు. సో.. ప్రపంచాన్ని పిచ్చెక్కిస్తున్న కృత్రిమ మేథకు కటీఫ్ కొట్టడం అమెరికాతోనే మొదలౌతోందన్నమాట. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్… అమెరికాను మళ్లీ గొప్ప అమెరికాగా మారుద్దాం రండి అని తెగ రెచ్చిపోయిన ప్రెసిడెంట్‌గారి దూకుడుకి మధ్యంతర ఎన్నికల్లో సడన్ బ్రేక్ పడింది. ఆవారా నిర్ణయాలతో అమెరికాను ఆగమాగం చేసినందుకే ట్రంప్‌ను లెంపకాయ కొట్టారన్నది తెలుస్తూనే ఉంది. కాకపోతే, ట్రంప్ పార్టీని ఇంతలా ఏడిపించిన కారణాలు ఏంటి? ఇమ్మిగ్రేషన్ చట్టాలు, ఆర్థిక పరిస్థితి, యుద్ధాలు, దిగుమతి సుంకాలు.. ఇలా మల్టిపుల్ కారణాలు రిపబ్లికన్ల కొంప ముంచినట్టు ఎలక్షన్స్‌కు ముందే ఒపీనియన్ పోల్స్ బయటికొచ్చాయి. ట్రంప్...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి