ఆ 21 దేశాలకు ప్రయాణాలు వద్దు.. అమెరికా పౌరులకు ట్రంప్ సర్కార్ కీలక ఆదేశాలు..!

అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గురువారం (జనవరి 8, 2026) అమెరికా తన పౌరులకు అధికారిక ప్రయాణ సలహా జారీ చేసింది. 21 దేశాలకు ప్రయాణించవద్దని అమెరికన్ పౌరులకు ట్రంప్ సర్కార్ సూచించింది. వీటిలో రష్యా, ఉక్రెయిన్, లిబియా, బుర్కినా ఫాసో ఉన్నాయి. కానీ భారతదేశం, పాకిస్తాన్ దేశాలను మాత్రం ఈ జాబితాలో చేర్చకపోవడం విశేషం..

ఆ 21 దేశాలకు ప్రయాణాలు వద్దు..  అమెరికా పౌరులకు ట్రంప్ సర్కార్ కీలక ఆదేశాలు..!
Us Travel Advisory

Updated on: Jan 08, 2026 | 9:50 PM

అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గురువారం (జనవరి 8, 2026) అమెరికా తన పౌరులకు అధికారిక ప్రయాణ సలహా జారీ చేసింది. 21 దేశాలకు ప్రయాణించవద్దని అమెరికన్ పౌరులకు ట్రంప్ సర్కార్ సూచించింది. వీటిలో రష్యా, ఉక్రెయిన్, లిబియా, బుర్కినా ఫాసో ఉన్నాయి. కానీ భారతదేశం, పాకిస్తాన్ దేశాలను మాత్రం ఈ జాబితాలో చేర్చకపోవడం విశేషం.. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌ను షేర్ చేసింది.

గురువారం (జనవరి 8, 2026) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పోస్ట్ చేసిన ప్రకటనలో US డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫారిన్ కాన్సులర్ అఫైర్స్ ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ఆ పోస్ట్‌లో, అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ కీలక ప్రకటన విడుదల చేసింది. “లెవల్ 1 నుండి 4 వరకు ఉన్న US పౌరులకు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేస్తున్నాము. లెవల్ 4 అంటే అక్కడికి ప్రయాణించవద్దు.” అంతేకాకుండా.. “స్థానిక పరిస్థితులు, ఈ దేశాలలోని US పౌరులకు సహాయం అందించే పరిమిత భద్రతా సామర్థ్యం ఆధారంగా లెవల్ 4ని కేటాయిస్తాము. ఈ ప్రదేశాలు ప్రమాదకరమైనవి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి ప్రయాణించవద్దు” అని పోస్ట్ పేర్కొంది.

ఈ 21 దేశాలకు ప్రయాణించవద్దని విజ్ఞప్తిః

ఆఫ్ఘనిస్తాన్

బెలారస్

బుర్కినా ఫాసో

బర్మా

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (CAR)

హైతీ

ఇరాన్

ఇరాక్

లెబనాన్

లిబియా

మాలి

నైజర్

ఉత్తర కొరియా

రష్యా

సోమాలియా

దక్షిణ సూడాన్

సూడాన్

సిరియా

ఉక్రెయిన్

వెనిజులా

యెమెన్

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇఖ్కడ క్లిక్ చేయండి..