UNICEF: సీరంతో ఒప్పందం చేసుకున్న యూనిసెఫ్‌… వంద దేశాలకు సరఫరా కానున్న వ్యాక్సిన్‌…

|

Feb 05, 2021 | 5:25 AM

UNICEF Signs Up With Serum: కరోనా మహమ్మారిని అంతమొందించే క్రమంలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరగుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కోవిషీల్డ్‌, కోవ్యాగ్జిన్‌ టీకాలు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి.

UNICEF: సీరంతో ఒప్పందం చేసుకున్న యూనిసెఫ్‌... వంద దేశాలకు సరఫరా కానున్న వ్యాక్సిన్‌...
Follow us on

UNICEF Signs Up With Serum: కరోనా మహమ్మారిని అంతమొందించే క్రమంలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరగుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కోవిషీల్డ్‌, కోవ్యాగ్జిన్‌ టీకాలు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి.
ఇదిలా ఉంటే ఇంకా చాలా దేశాలకు వ్యాక్సిన్‌ చేరుకోని పరిస్థితి ఉంది. అల్ప, మధ్య ఆదాయ దేశాలకు కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. దీంతో అందరికీ వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకురావాలని భావించిన యూనిసెఫ్‌ ప్రపంచదేశాలకు వ్యాక్సిన్‌ సరఫరా చేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే సీరం ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా.. ఆక్స్‌ఫర్డ్‌- ఆస్ట్రాజెనెకా, నొవావాక్స్‌ సంస్థలకు చెందిన 1.1 బిలియన్‌ వ్యాక్సిన్లను 100 దేశాలకు పంపనున్నారు. ఈ విషయమై యూనిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మాట్లాడుతూ.. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో దీర్ఘకాల వ్యాక్సిన్‌ సరఫరా ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని తెలిపారు. ఇందులో ఆస్ట్రాజెనెకా, నొవావాక్స్‌ సంస్థల వ్యాక్సిన్లు ఉన్నాయన్నారు.

Also Read: Corona Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌.. సురక్షితంగా సేవలందించేందుకు వీలుగా పోలీసులకు రెండో దశ కోవిడ్‌ టీకా