UN Chief Receives COVID-19 Vaccine: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. సుమారు 8 నెలల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాను అంతమొందించే కార్యక్రమం అంతటా కొనసాగుతోంది.
అయితే వ్యాక్సినేషన్ చేసుకోవడానికి కొందరు ముందుకు రావట్లేదు. ఏవైనా సైడ్ ఎఫెక్ట్‌లు కలుగుతాయన్న భయంతో వ్యాక్సినేషన్ చేసుకోవడానికి జంక్కుతున్నారు. అయితే ఈ భయాలను పొగట్టడానికే కొందరు ప్రముఖులు వ్యాక్సినేషన్ చేసుకొని సామాన్యుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ కొవిడ్-19 వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. న్యూయార్క్ సిటీ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి హాజరైన ఆంటోనియా వ్యాక్సిన్ వేసుకున్నారు. ప్రస్తుతం 71 ఏళ్లున్న ఆంటోనియా శుక్రవారం తొలి డోసు వేయించుకున్నారు. వ్యాక్సిన్ వేయించుకుంటున్న సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను ట్వీట్టర్‌లో షేర్ చేసిన ఆంటోనియో.. ప్రజలందరు కూడా సాధ్యమైనంత త్వరగా కోవిడ్ టీకా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ప్రాంతంలోనూ ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలకు సూచించారు. అంతేకాకుండా మహమ్మారి విజృంభించిన సమయంలో ముందుండి నిలబడిన వారితోపాటు, వ్యాక్సిన్ తయారీలో కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు, పాఠశాల సిబ్బంది సహా 65 ఏళ్లు పైబడిన వారికి టీకా ఇస్తున్నారు. ఇదిలా ఉంటే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే బహిరంగంగా వ్యాక్సిన్ చేసుకుంటానని ప్రకటించిన ఆంటోనియా అందుకు అనుగుణంగానే టీకా ఇప్పించుకున్నారు.
I am very thankful to the City of New York for including @UN staff and diplomats in their #COVID19 vaccination programme.
Solidarity is crucial in our global fight against the pandemic.pic.twitter.com/z9WXm60OiS
— António Guterres (@antonioguterres) January 29, 2021
My admiration and gratitude to everyone who has worked to safeguard communities during this pandemic and make a #COVID19 vaccine a reality.
Their perseverance & solidarity are an example to us all. pic.twitter.com/f9NErnijMN
— António Guterres (@antonioguterres) January 29, 2021
Also Read: సీరం కంపెనీ నుంచి మరో వ్యాక్సిన్, ‘కోవోవాక్స్’ , జూన్ నుంచి అందుబాటులోకి, ఆదార్ పూనావాలా