Russia Ukraine War: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం.. తృటిలో తప్పించుకుని..

|

May 24, 2022 | 6:06 PM

రెండు నెలల క్రితం పుతిన్‌ ఓ దాడి నుంచి తప్పించుకొన్నట్లు ఉక్రెయిన్‌ రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌ డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం అధిపతి కైర్‌యలో స్కై న్యూస్‌కి..

Russia Ukraine War: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం.. తృటిలో తప్పించుకుని..
Putin
Follow us on

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భద్రతా వలయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు(Vladimir Putin )  ఉంటుంది. దానిని దాటుకొని పుతిన్‌పై హత్యాయత్నం జరిగినట్లు ప్రచారం మొదలైంది. రెండు నెలల క్రితం పుతిన్‌ ఓ దాడి నుంచి తప్పించుకొన్నట్లు ఉక్రెయిన్‌ రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌ డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం అధిపతి కైర్‌యలో స్కై న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. కాకసస్‌ పర్యటనలో ఉన్న సమయంలో అక్కడి ప్రతినిధులు పుతిన్‌పై దాడి చేసినట్లు బుద్‌నోవ్‌ పేర్కొన్నారు. ఈ దాడి నుంచి పుతిన్‌ సురక్షితంగా తప్పించుకొన్నారని వెల్లడించారు. నల్లసముద్రం, కాస్పియన్‌ సముద్రం మధ్య ఉన్న ప్రాంతాలను కాకసస్‌ అని పిలుస్తారు. బుదనోవ్‌ కచ్చితంగా ఆ ప్రాంతం పేరు మాత్రం వెల్లడించలేదు. కాకపోతే ఉక్రెయిన్‌పై దండయాత్ర మొదలైన తొలినాళ్లలోనే ఈ దాడి జరిగినట్లుగా వెల్లడించారు. ఈ విషయాన్ని రష్యాలో వీలైనంత రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించిందన్నారు. పుతిన్‌కు ఆగస్టు మధ్య నుంచి వ్యతిరేక పవనాలు వీయవచ్చని.. ఈ ఏడాది చివరి నాటికి క్రెమ్లిన్‌లో తిరుగుబాటు జరిగి ఆయన్ను పదవి నుంచి తప్పించవచ్చని ఆయన జోస్యం చెప్పారు. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైపోయిందని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

గతంలో ఐదు హత్యాయత్నాల నుంచి తప్పించుకొని..

పుతిన్‌పై 2017 నాటికి ఐదు హత్యాయత్నాలు జరిగాయి. ఈ విషయాన్ని 2017లో ఓలివర్‌ స్టోన్‌ అనే డైరెక్టర్‌తో మాట్లాడుతూ స్వయంగా పుతినే వెల్లడించారు. కానీ, తాను వాటి గురించి ఆందోళన చెందనని అప్పట్లో ఆయన పేర్కొన్నారు.