Ukrainian Couple: రష్యా(Russia) ఉక్రెయిన్ దేశంపై దాడి చేస్తున్న నేపథ్యంలో మాతృ భూమి రక్షణ కోసం ఉక్రెయిన్లు స్వయంగా కదన రంగంలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక ప్రేమ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యి.. మర్నాడు రష్యా సైనికులను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ రక్షణ దళంలో చేరారు. అయితే నిజానికి ఈ ప్రేమ జంట వివాహ వేడుక ఈ ఏడాది మే నెలలో జరగాల్సి ఉంది. కానీ దేశం కోసం యుద్ధంలో పాల్గొనడానికి తమ పెళ్లిని ముందుకు తీసుకుని వచ్చి.. తమ పెళ్లి ప్రణాళికను మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. ఈ జంట కథను CNN జర్నలిస్ట్ క్రిస్టియన్ స్ట్రీబ్ పంచుకున్నారు. ఉక్రెయిన్ రాజధాని నగరం కైవ్‌లోని సెయింట్ మైకేల్స్ గోల్డెన్ డోమ్డ్ మొనాస్టరీలో గురువారం 21 ఏళ్ల యారినా అరివా (Yaryna Arieva), 24 ఏళ్ల స్వియాటోస్లావ్ ఫర్సిన్ (Sviatoslav Fursin) పెళ్లి చేసుకున్నారు. వివాహ జరిగిన 24 గంటల తర్వాత ఈ కొత్త జంట శుక్రవారం రష్యా కు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి ఉక్రెయిన్ రక్షణ దళంలో చేరారు.
2019 అక్టోబర్‌లో కైవ్‌లో జరిగిన నిరసనలో యారీనా, స్వియాటోస్లావ్‌ల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లితో ఒక్కటవ్వాలని భావించారు. అయితే ఇంతలో యుద్ధం ముంచుకుని రావడంతో.. తమ భవిష్యత్తు ఏమిటో తెలియక ముందు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
యారీనా CNN తో మాట్లాడుతూ.. దేశంలోని పరిస్థితి కష్టంగా ఉంది. మేము మా భూమి కోసం పోరాడబోతున్నాం.మేము చనిపోవచ్చు, అందుకనే తాము ఇద్దరూ కలిసి కొన్ని రోజులైనా జీవించాలని కోరుకున్నామని చెప్పింది.
పెళ్లి తర్వాత.. ఈ కొత్త జంట దేశాన్ని రక్షించడంలో సహాయపడే ప్రయత్నాలలో భాగంగా స్థానిక టెరిటోరియల్ డిఫెన్స్ సెంటర్‌కు వెళ్లడానికి సిద్ధమయ్యారు.
“మేము మా దేశాన్ని రక్షించుకోవాలి. మాతృభూమి రక్షణ ఉత్తమం అని చెప్పారు. మా భూమిని రక్షించుకోవడానికి తాను చేయగలిగినదంతా చేస్తాను” అని యారీనా చెప్పారు. అయితే తమకు రక్షణ దళ అధికారులు ఎటువంటి విధులను కేటాయిస్తారా తమకు తెలియదని.. అయితే వారు ఏ విధులను ఇచ్చినా నిర్వహిస్తామని చెప్పారు.
అయితే ఏదోకరోజు మా దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయి. మా భూమి మాకు దక్కుతుంది.. రష్యన్లు లేకుండా మా దేశం సురక్షితంగా ఉంటుంది.. సంతోషంగా మేము మా వైవాహిక జీవితాన్ని గడుపుదామని ఈ కొత్త జంట ఆశాభావం వ్యక్తం చేస్తుంది.
Also Read: