నాటో ఉందా.. ఉక్రెయిన్‌‌కు సహకరించింది ఎవరు..? ప్రతీకారం తప్పదంటూ రష్యా వార్నింగ్..

ఓ వైపు శాంతి చర్చల జపం.. మరోవైపు భీకర గర్జన. ఇన్ని రోజులు రష్యా దాడులతో అల్లాడిన ఉక్రెయిన్‌.. ఇప్పుడు యుద్ధ భూమిలో ఉగ్రరూపం చూపిస్తుంది. చాలాకాలం రష్యాన్ ఆర్మీదే అప్పర్‌హ్యాండ్. కానీ, ఈసారి ఉక్రెయిన్ గేమ్ ఛేంజ్ చేసింది. అసలు ఉక్రెయిన్‌ ధైర్యం ఏంటి..? ఈ నాటు కొట్టుడు వెనుక నాటో ఉందా? రష్యా ఇప్పుడు ఏం చెయ్యబోతోంది.. అనేది ఉత్కంఠగా మారింది.

నాటో ఉందా.. ఉక్రెయిన్‌‌కు సహకరించింది ఎవరు..? ప్రతీకారం తప్పదంటూ రష్యా వార్నింగ్..
Russia Ukraine War

Updated on: Jun 05, 2025 | 7:27 AM

మొన్నటివరకూ శాంతి మంత్రం వల్లెవేసిన ఉక్రెయిన్ ఒక్కసారిగా రష్యాపై విరుచుకుపడింది. రష్యా ఊహలకు కూడా అందకుండా వ్యూహాత్మక దాడులు చేస్తోంది. మొన్న ఏకంగా 40 ఎయిర్‌బేస్‌లను ఏదో వీడియోగేమ్‌ ఆడుతున్నంత అలవోకగా దాని సొంతగడ్డ మీదే ధ్వంసం చేసిన తీరు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. రెండు రోజుల గ్యాప్‌లోనే.. అండర్ వాటర్ బాంబ్స్‌తో రష్యాలోని బ్రిడ్జిని పేల్చేసింది ఉక్రెయిన్‌. 19 కిలోమీటర్ల పొడవున్న క్రిమియా బ్రిడ్జిని అండర్ వాటర్ లో పిల్లర్లను టార్గెట్ చేస్తూ పేల్చేసింది. రష్యా క్షిపణులతో రివేంజ్ అటాక్స్‌ చేస్తున్నా.. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్‌కు అదేమంత ఎదురుదెబ్బ కాదు. రష్యాకే దారుణమైన డ్యామేజ్ జరిగింది.

ప్రపంచ దేశాల నుంచి డ్రోన్లు కోరుతున్న ఉక్రెయిన్‌

ఈ దాడులతో డ్రోన్ల ఇంపార్టెన్స్ గుర్తించిన ఉక్రెయిన్ ప్రపంచ దేశాల నుంచి మరింత సాయం కోరుతోంది. బ్రిటన్ వెంటనే స్పందించింది. ఉక్రెయిన్‌కు ఏకంగా లక్ష డ్రోన్లు అందిస్తామని హామీ ఇచ్చింది. 2026 ఏప్రిల్ నాటికి ఆ డ్రోన్ల సరఫరా పూర్తి చేస్తామని చెప్పింది. కేవలం 100 డ్రోన్లతోనే రష్యాకు చెందిన 40 ఫైటర్ జెట్స్‌ను ధ్వంసం చేస్తే.. ఇక ఉక్రెయిన్ చేతికి లక్ష డ్రోన్లు వచ్చాయో.. ఇక ఆపదలు మరింత పెరుగుతాయి..

ఉక్రెయిన్‌కు సహకరించింది ఎవరు?

రష్యాపై ఉక్రెయిన్‌ దాడి చేసినా.. దానికి సహకరించింది ఎవరు? నాటో ప్రమేయం లేనిదే ఇంతపెద్ద ఎటాక్‌ను చేసిందా..? అంటే ఉక్రెయిన్‌ వెనుక నాటో హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఉక్రెయిన్‌కు తమ ఇంటెలిజెన్స్‌ను ఇచ్చింది నాటో. తమ శాటిలైట్లతో పలు లొకేషన్లను ఉక్రెయిన్‌కు షేర్‌ చేసింది నాటో కూటమి. తమ డ్రోన్‌ శక్తిని ఉక్రెయిన్‌కు ఇచ్చి రష్యాపై దాడికి పరోక్షంగా కారణమైంది నాటో కూటమి. రష్యా వైమానిక రక్షణ వ్యవస్థను హ్యాక్‌ చేసినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇంత పెద్ద దాడిని నాటో ఆపలేకపోవడం ఇప్పుడు ఆ కూటమి దేశాలకు విషమంగా పరిణమించబోతోంది.

ప్రతీకారం తప్పదని రష్యా రక్షణ శాఖ హెచ్చరిక..

ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులపై రష్యా తీవ్ర అవమాన భారంతో ఉడికిపోతోంది. కారుచౌకైన డ్రోన్లతో కోలుకోలేని దెబ్బతీయడాన్ని జీర్ణం చేసుకోలేకపోతోంది. దీనికి ప్రతీకారం తప్పదని రష్యా రక్షణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. కనుక ఉక్రెయిన్‌పై భారీ స్థాయిలో విరుచుకుపడటం ఖాయమే అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఉక్రెయిన్‌ ప్రధానంగా నాటో సభ్యదేశాలు సమకూర్చిన ఆయుధాలనే తనపై వాడుతోంది. కనుక నాటో దేశాల్లోని సైనిక స్థావరాలు, ఆయుధాగారాలను రష్యా లక్ష్యంగా చేసుకోవచ్చు. వాటిపై దాడులు చేస్తామని గతంలోనే ఎన్నోసార్లు హెచ్చరించింది కూడా. ఉక్రెయిన్‌ బహుశా ఈ ప్రమాదాన్ని ముందే ఊహించింది. డ్రోన్‌ దాడులు పూర్తిగా తన పనేనని, నాటో మిత్రులకు ఏ సంబంధమూ లేదని జెలెన్‌స్కీ ప్రకటించారు. నష్ట, అవమాన తీవ్రత దృష్ట్యా ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడికి దిగినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..