Corona Virus: వ్యాక్సిన్ వేయించుకున్నామని కోవిడ్ నిబంధనలకు గుడ్ బై.. మళ్ళీ రోజుకు 50 వేల కేసులు నమోదు..

|

Oct 20, 2021 | 8:21 AM

Corona Virus: గత కొన్ని ఏళ్లుగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది. చాలా దేశాల్లో కోవిడ్ థర్డ్ వేవ్ స్టార్ అయ్యింది. కేసులు తగ్గినట్లే తగ్గి.. మళ్ళీ భారీగా..

Corona Virus: వ్యాక్సిన్ వేయించుకున్నామని కోవిడ్ నిబంధనలకు గుడ్ బై.. మళ్ళీ రోజుకు 50 వేల కేసులు నమోదు..
Uk Corona
Follow us on

Corona Virus: గత కొన్ని ఏళ్లుగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది. చాలా దేశాల్లో కోవిడ్ థర్డ్ వేవ్ స్టార్ అయ్యింది. కేసులు తగ్గినట్లే తగ్గి.. మళ్ళీ భారీగా కేసులు నమోదవుతూ ఆందోళనకు గురి చేస్తున్నాయి.  మనదేశంలో కరోనా విజృంభణ మెల్లగా తగ్గుముఖం పడుతుండగా.. రష్యా, బ్రిటన్ లో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. బ్రిటన్ లో వ్యాక్సిన్ ఇచ్చినతర్వాత కోవిడ్ కేసుల నమోదు భారీగా తగ్గాయి. దీంతో జూలై నుంచి బ్రిటన్ లో కరోనా నిబంధనలకు తిలోదకాలు ఇచ్చింది. మాస్కులకు గుడ్ బై చెప్పేశారు అక్కడ ప్రజలు. భౌతిక దూరం, మాస్కులు, రద్దీ ప్రదేశాల్లో టీకా ధ్రువపత్రం తప్పనిసరికాదని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మళ్ళీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 15 రోజుల నుంచి 35 నుంచి 40 వేల కేసులు నమోదయ్యేవి..

గత 24 గంటల్లో కొత్త కేసులు భారీగా నమోదయ్యాయి. 50 వేలకు చేరువయ్యాయి. ఇతర దేశాలతో పోల్చితే బ్రిటన్‌లో కొవిడ్ వ్యాప్తి అధికంగా ఉందని ఆందోళన వ్యక్తమవుతుంది. రోజు రోజుకీ పాజిటివ్‌ కేసులు, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాలు ఎక్కువగా ఉన్నాయి’ అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జిమ్ నెయిస్మిత్ ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల సంఖ్యలో యూరోపియన్ దేశాల్లో రష్యా తర్వాతి స్థానం బ్రిటన్‌దే.

మరోవైపు బ్రిటన్ లో శీతాకాలం సమీపించింది. ఓ వైపు పెరుగుతున్న కరోనా కేసులు.. మరోవైపు శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య అధికంగా ఉంది.. దీంతో వైద్య సేవలపై పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఓ వైపు పాఠశాలలు తెరవడంకూడా కరోనా కేసులు పెరగడానికి కారణం అని రీడింగ్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణుడు సైమన్ క్లార్క్‌  చెప్పాడు. ప్రస్తుతం బ్రిటన్ లో  గటున రోజుకు ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య 900కి చేరింది. వేసవిలో 500కి పైగా ఉన్న ఆ సంఖ్య దాదాపు రెట్టింపయ్యింది. జులైలో బ్రిటన్‌ కొవిడ్ ఆంక్షలను తొలగించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, నిర్లక్ష్యంతోనే మళ్ళీ కేసుల నమోదుకు కారణం అంటూ వైద్య నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రధాని బోరిస్ జాన్సన్ ఆర్థికవ్యవస్థను మళ్ళీ గాడిన పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకనే మళ్ళీ దేశంలో కరోనా అదుపుకు లాక్‌డౌన్, ఆంక్షలు విధించడంపై విముఖతతో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:  టీడీపీ చర్యలకు నిరసనకు రెడీ అవుతున్న ఎంపీ మార్గాన్ని భరత్.. వైసీపీనేతలకు పిలుపు..