Rishi Sunak – UK PM Race: బ్రిటన్ ప్రధాని రేసులో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ముందంజలో ఉన్న విషయం తెలిసిందే. తొలి రౌండు రౌండ్ల ఓటింగ్‌లో రిషి సునాక్ అత్యధికమంది ఎంపీల మద్దతుతో ముందంజలో నిలిచారు. పలు రౌండ్ల అనంతరం కన్జర్వేటివ్ పార్టీ లీడర్‌ను ఎన్నుకోనున్నారు. పార్టీ లీడర్‌గా ఎవరు నిలుస్తారో వారే బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టనున్నారు. ఈ సయయంలో మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్.. రిషి సునాక్ ప్రధానమంత్రి కాకుండా అంతర్గతంగా ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్ ప్రధాని ఎన్నికలో మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ను ఎలాగైనా ఓటమిపాలు చేసేందుకు తాత్కాలిక ప్రధాని బోరిస్ జాన్సన్ కుట్ర చేస్తున్నారని మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ప్రధాని ఎన్నికల్లో రిషి సునాక్ తప్ప.. మరెవరికైనా మద్దతు తెలపండి అంటూ బోరిజ్ జాన్సన్ (Boris Johnson) ఎంపీలకు సూచించినట్టు తెలుస్తోంది. తనపై అభియోగాలు రావడం, పలువురు మంత్రులు రాజీనామా చేయడంతో అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన జాన్సన్ ఈనెల 7న బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, రిషి సునాక్ తనకు ద్రోహం చేశారని, ఆయన కారణంగానే సొంత పార్టీ నేతలు కూడా తనకు దూరమయ్యారని, దీంతోనే రాజీనామా చేయాల్సి వచ్చిందని బోరిస్ ఆగ్రహంతో ఉన్నట్టు పేర్కొంటున్నారు.
తదుపరి ప్రధానిగా ఎవరు ఉండాలన్న విషయంలో తలదూర్చబోనని, బరిలో ఉన్న ఏ అభ్యర్థినీ బలపరచనని జాన్సన్ బహిరంగంగా వెల్లడించినప్పటికీ.. సునాక్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాని కాకూడదంటూ తన మద్దతుదారులతో ఆయన మంతనాలు సాగిస్తున్నట్టు వార్తా సంస్థ ‘ద టైమ్స్’ కథనాన్ని ప్రచురించింది. విదేశాంగమంత్రి లిజ్ ట్రస్ లేదంటే జాకబ్ రీస్, డోరిస్, పెన్నీ మోర్డాంట్‌లలో ఎవరో ఒకరికి మద్దతివ్వాలని బోరిస్ జాన్సన్ సూచించినట్టు పేర్కొంది. 10 డౌనింగ్ స్ట్రీట్ రిషిని వ్యక్తిగతంగా ద్వేషిస్తోందని, బోరిస్‌ను పదవి నుంచి తప్పించేందుకు సునాక్ కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేసినట్టు భావిస్తోందంటూ టైమ్స్ కథనం పేర్కొంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి..