
యూకేలోని ఒక బీచ్‌లో వింత జీవులు ప్రత్యక్షమయ్యాయి. అవే సముద్ర జలాల్లో జీవింతే పోర్చుగీస్ మ్యాన్ ఓ’ వార్” అనే జీవివులు ఇవి చాలా ప్రమాదకరమైనవి.. ఇటీవల సముంద్రంలోంచి పెద్ద సంఖ్యలో ఇవి ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. వీటిని ఫ్లోటింగ్ టెర్రర్స్ (తేలియాడే భయానక జీవులు)గా అని కూడా పిలుస్తారు. ఇవి అబెరావాన్‌తో పాటు పెంబ్రోక్‌షైర్, గ్వినెడ్, ఆంగ్లెసీ వంటి తీర ప్రాంతాల్లో కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.ఈ క్రమంలో ప్రజలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ వింత జీవులను ప్రజలు ఎవరూ ముట్టుకోవద్దని.. అవి చాలా ప్రమాదకరమైనవి తెలిపారు.
ఇవి సాధారణంగా జెల్లీఫిష్‌ల మాదిరి కనిపిస్తాయి.. కానీ అత్యంత విషపూరితమైన జీవులు. ఒక వేళ్ల పొరపాటున దీని టెంటకిల్స్ మన చర్మానికి తగిలితే మనకు తీవ్రమైన నొప్పి, దద్దుర్లు, బొబ్బలు వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు.. వీటి వల్ల కొన్నిసార్లు తీవ్ర జ్వరం, శ్వాసకోస సంబంధిత సమస్యలు కూడా రావచ్చు. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే ఇవి చనిపోయిన తర్వాత కూడా వాటి టెంటకిల్స్ ఇంకా విషంతో నిండి ఉంటాయి. అందుకే ప్రజలు ఎవ్వరూ ఎప్పటి పరిస్థితుల్లో వాటి దరిదాపుల్లోకి వెళ్లవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
పోర్చుగీస్ మ్యాన్ ఓ’వార్ అంటే ఏమిటి?
పోర్చుగీస్ మ్యాన్ ఓ’ వార్‌ను చూసిన వెంటనే చాలా మంది ఇది జెల్లీ ఫిష్‌గా అనుకుంటారు, కానీ వాస్తవానికి ఇది సైఫోనోఫోర్ – అంటే అనేక చిన్న జీవులు ఒక సమూహంగా ఏర్పడి జీవించే ప్రత్యేకమైన జీవి. వైల్డ్‌లైఫ్ ట్రస్ట్‌ల ప్రకారం, ఈ సముద్ర ఉదారంగు శరీరం, గులాబీ రంగు శిఖరంతో పొడవైన నీలిరంగు టెంటకిల్స్‌తో కనిపిస్తుంది. ఇవి సాధారణంగా సముద్ర నీటిలో తేడియాడుతూ ఉంటాయి. ఏవైనా బలమైన తుఫాన్‌లు, అలలు వచ్చినప్పుడు ఇవి సముద్ర తీరాలకు కొట్టుకొస్తాయని నిపుణులు చెబుతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.