Body Guard: ‘జీతం ఇవ్వడం లేదనీ..’ క్యాబినెట్‌ మంత్రిని గన్‌తో కాల్చి చంపిన బాడీ గార్డు

|

May 03, 2023 | 7:08 AM

ఉగాండాలో కార్మిక శాఖ మంత్రిని బాడీగార్డ్‌ కాల్చి చంపాడు. మంగళవారం తెల్లవారుజామున జరిగిని ఓ ప్రైవేట్ వివాదంలో బాడీ గార్డ్‌ తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆ దేశ కార్మిక శాఖ మంత్రి రిటైర్డ్ ఆర్మీ కల్నల్..

Body Guard: జీతం ఇవ్వడం లేదనీ.. క్యాబినెట్‌ మంత్రిని గన్‌తో కాల్చి చంపిన బాడీ గార్డు
Ugandan Minister Killed By Bodyguard
Follow us on

ఉగాండాలో కార్మిక శాఖ మంత్రిని బాడీగార్డ్‌ కాల్చి చంపాడు. మంగళవారం తెల్లవారుజామున జరిగిని ఓ ప్రైవేట్ వివాదంలో బాడీ గార్డ్‌ తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆ దేశ కార్మిక శాఖ మంత్రి రిటైర్డ్ ఆర్మీ కల్నల్ చార్లెస్ ఎంగోలా (మార్జీ) మృతి చెందాడు. అనంతరం బాడీగార్డ్‌ కూడా గన్‌తో కాల్చుకుని మరణించాడు. ఉగాండా రాజధాని కంపాలాలోని మంత్రి ఇంటిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వేతనం విషయమై వివాదం నెలకొన్నట్లు అక్కడి స్థానిక మీడియా పేర్కొంది.

మంత్రి చార్లెస్ ఎంగోలా వద్ద బాడీ గార్డ్‌గా పనిచేస్తున్న సదరు వ్యక్తికి చాలా కాలంగా వేతనాలు చెల్లించడం లేదనే కారణంతో మంత్రిని గార్డు కాల్చి చంపినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నట్లు మీడియా తెలిపింది. పోలీసు డిటెక్టివ్‌లు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాలను స్వాధీనం చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. ఇది దురదృష్టకర సంఘటన. ఎంగోలా హత్యకు దారితీసిన కారణాలు ఏమిటనేది దర్యాప్తులో తెలుస్తుందని ఆర్మీ ప్రతినిధి ఫెలిక్స్ కులాయిగ్యే ట్వీట్‌ చేశారు.

కాగా ఉగాండా దేశంలో గడచిన కొన్ని యేళ్లుగా ఉన్నత అధికారులను కాల్చి చంపుతున్న దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 2021లో కంపాలాలో మాజీ ఆర్మీ చీఫ్‌ వాహనంపై ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో చీఫ్‌ తీవ్రంగా గాయపడగా, అతని కుమార్తె మృతి చెందింది. తాజాగా మంత్రిని గన్‌తో కాల్చి చంపడంతో ఈ సంఘటన సంచలనంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.