చైనాను వణికిస్తున్న ‘లేకిమా’ తుఫాను!

| Edited By:

Aug 12, 2019 | 6:43 PM

చైనాను లేకిమా తుఫాను అతలాకుతలం చేసింది. తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలు, వరదలకు 45 మంది మరణించారు, 16 మందికి పైగా గల్లంతయ్యారు. పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలను చేపట్టిన అధికారులు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను కారణంగా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు 200 రైళ్లను, వేలాది విమాన సర్వీసులను సోమవారం వరకు రద్దు చేసినట్టు ప్రకటించింది. షాంఘైలో రెండో అతిపెద్ద విమానాశ్రయం కూడా సర్వీసులు నిలిపేసింది. తూర్పు […]

చైనాను వణికిస్తున్న లేకిమా తుఫాను!
Follow us on

చైనాను లేకిమా తుఫాను అతలాకుతలం చేసింది. తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలు, వరదలకు 45 మంది మరణించారు, 16 మందికి పైగా గల్లంతయ్యారు. పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలను చేపట్టిన అధికారులు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను కారణంగా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు 200 రైళ్లను, వేలాది విమాన సర్వీసులను సోమవారం వరకు రద్దు చేసినట్టు ప్రకటించింది. షాంఘైలో రెండో అతిపెద్ద విమానాశ్రయం కూడా సర్వీసులు నిలిపేసింది. తూర్పు ప్రాంతంలో జెజియాంగ్‌లో సంభవించిన తుఫాను ‘లేకిమా’ ప్రభావంతో గంటకు 187 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయని, తుఫాను ధాటికి కొండచరియలు విరిగి పడ్డాయని అధికారులు తెలిపారు. లేకిమా సూపర్‌ టైఫూన్‌ నుంచి క్రమంగా బలహీనపడినట్టు వాతావరణశాఖ వెల్లడించింది.