మళ్లీ రెచ్చిపోయిన ఇరాన్.. అమెరికా ఎంబసీ లక్ష్యంగా దాడులు..!

| Edited By: Ram Naramaneni

Jan 09, 2020 | 10:14 AM

బుధవారం ఇరాక్‌లోని అమెరికా వైమానిక స్థావరాలు, ఎయిర్‌బేస్‌ లక్ష్యంగా క్షిపణులను ప్రయోగించిన ఇరాన్.. తన దూకుడును కొనసాగిస్తోంది. తాజాగా ఇరాక్ రాజధాని బాగ్దాద్‌పై మరో రెండు రాకెట్లను ప్రయోగించింది ఇరాన్. అక్కడున్న అమెరికా రాయబార కార్యాలయాన్ని టార్గెట్‌గా చేసుకొని రాకెట్లను సంధించింది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కాగా అమెరికా జరిపిన వైమానిక దాడిలో ఇరాన్ జనరల్ కమాండర్ కాశీం సులేమాన్ దుర్మరణం పాలయ్యారు. దీంతో రగిలిపోతోన్న ఆ దేశం అమెరికాపై […]

మళ్లీ రెచ్చిపోయిన ఇరాన్.. అమెరికా ఎంబసీ లక్ష్యంగా దాడులు..!
Follow us on

బుధవారం ఇరాక్‌లోని అమెరికా వైమానిక స్థావరాలు, ఎయిర్‌బేస్‌ లక్ష్యంగా క్షిపణులను ప్రయోగించిన ఇరాన్.. తన దూకుడును కొనసాగిస్తోంది. తాజాగా ఇరాక్ రాజధాని బాగ్దాద్‌పై మరో రెండు రాకెట్లను ప్రయోగించింది ఇరాన్. అక్కడున్న అమెరికా రాయబార కార్యాలయాన్ని టార్గెట్‌గా చేసుకొని రాకెట్లను సంధించింది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కాగా అమెరికా జరిపిన వైమానిక దాడిలో ఇరాన్ జనరల్ కమాండర్ కాశీం సులేమాన్ దుర్మరణం పాలయ్యారు. దీంతో రగిలిపోతోన్న ఆ దేశం అమెరికాపై తమ దూకుడును కొనసాగిస్తోంది.

మరోవైపు ఇరాన్ దాడులపై మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాము యుద్దాన్ని కోరుకోవడం లేదంటూ తెలిపారు. ఆ ప్రకటన చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇరాన్ మరోసారి క్షిపణి దాడులు చేసింది. మరి ఈ దాడులపై అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి.