Brazil Rain: బ్రెజిల్‌లో వరద బీభత్సం..పలు ప్రాంతాల్లో విరిగిపడ్డ కొండచరియలు.. 24 మంది మృతి

భారీ వర్షాలు బ్రెజిల్‌ను వణికిస్తున్నాయి. గత ఐదారు రోజులుగా కురుస్తున్నకుండపోత వానలకు పట్టణాలు, గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. ప్రధానంగా శాంటా కాటరినా స్టేట్‌లో ఇళ్లు, రోడ్లు వరదనీటిలో మునిగాయి.

Brazil Rain: బ్రెజిల్‌లో వరద బీభత్సం..పలు ప్రాంతాల్లో విరిగిపడ్డ కొండచరియలు.. 24 మంది మృతి
Brazil Rains

Updated on: Feb 20, 2023 | 8:38 AM

ఉత్తర సావో పాలో రాష్ట్రంలోని పలు నగరాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో కనీసం 19 మంది మృతి చెందారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని బ్రెజిల్ అధికారులు ఆదివారం తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారు, గాయపడినవారు, తప్పిపోయిన వారి ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్‌లు గాలిస్తున్నాయి. ఇంతలో, సావో సెబాస్టియో, బెర్టియోగా నగరాల్లో జరుపుకోవాల్సిన కార్నివాల్ పండుగ రద్దు చేయబడింది. తన నగరంలో జరిగిన ఘోర విధ్వంసానికి సంబంధించిన పలు వీడియోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు బాధితులు. వీడియోలో, వరదలో ఉన్న పిల్లవాడిని వీధిలో వరుసలో ఉన్న స్థానికులు రక్షించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

గత ఒక్కరోజే ఈ ప్రాంతంలో 600 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. బ్రెజిల్ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో  కురిసిన భారీ వర్షపాతం ఇదేనని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అదే సమయంలో, బెర్టియోగా నగరంలో 687 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని ప్రభుత్వం తెలిపింది.

ఇళ్లు జలమయం

ఉబాటుబా, సావో సెబాస్టియానో, ఇల్హబెలా, కరాగ్వాటాటుబా , బెర్టియోగా నగరాల్లో సహాక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇళ్లు జలమయమై పైకప్పులు మాత్రమే కనిపిస్తున్నాయి. నివాసితులు చిన్న పడవల్లో సరుకులను, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రియో డి జెనీరోను పోర్ట్ సిటీ ఆఫ్ శాంటోస్‌కి కలిపే రహదారి కొండచరియలు విరిగిపడటం.. వరదల కారణంగా మూసుకుపోయింది.

లోయ ప్రాంతాలలో భారీ హిమపాతం..

జమ్మూ, కశ్మీర్‌లోని పుల్వామా,త్రాల్ ఉప జిల్లాలతో సహా చాలా లోతట్టు, ఎత్తైన ప్రాంతాలలో ఇటీవల భారీ హిమపాతం కనిపించింది. హిమపాతం కారణంగా పరిస్థితిని నియంత్రించడానికి పరిపాలన ట్రాల్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి. 9వ తేదీ నుంచి 11వ తేదీ మధ్య మైదాన ప్రాంతాల్లో తేలికపాటి హిమపాతం, ఎత్తైన ప్రాంతాల్లో విపరీతంగా మంచు కురిసింది. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం