జపాన్‌లో రెచ్చిపోయిన సైకో.. చిన్నారులే టార్గెట్‌గా దాడి

జపాన్‌లోని కవాసకి నగరంలో ఓ దుండగుడు వీరంగం సృష్టించాడు. కత్తితో అనేక మందిపై విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు చనిపోగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో చాలా మంది చిన్నారులే ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటన జపాన్‌ కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.00 గంటలకు చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్లేందుకు బస్‌ […]

జపాన్‌లో రెచ్చిపోయిన సైకో.. చిన్నారులే టార్గెట్‌గా దాడి

Updated on: May 28, 2019 | 10:38 AM

జపాన్‌లోని కవాసకి నగరంలో ఓ దుండగుడు వీరంగం సృష్టించాడు. కత్తితో అనేక మందిపై విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు చనిపోగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో చాలా మంది చిన్నారులే ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

అయితే ఈ ఘటన జపాన్‌ కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.00 గంటలకు చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్లేందుకు బస్‌ స్టాప్‌కు వచ్చిన విద్యార్థులే లక్ష్యంగా దుండగుడు దాడికి దిగాడని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. దాడికి పాల్పడ్డ అనంతరం నిందితుడు కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us