కోవిడ్-19 ఎఫెక్ట్.. ఇక ఇళ్ల నుంచే పని చేయండి.. సిబ్బందికి ట్విటర్ ఆదేశం

| Edited By: Pardhasaradhi Peri

Mar 03, 2020 | 6:12 PM

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కోవిడ్-19 తీవ్రతకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్... ట్విటర్ కూడా 'భయపడిపోయినట్టు కనిపిస్తోంది'. వచ్ఛే సోమవారం నుంచి తమ సిబ్బంది అంతా తమ ఇళ్ల నుంచే పని  చేయాలని ఆదేశించింది.Us, Sanfrancisco, Twitter, Corona, Work From Home, Employees, Monday, Jennifer Christie, World Wide, South Korea, Japan, Hongkong

కోవిడ్-19 ఎఫెక్ట్.. ఇక ఇళ్ల నుంచే పని చేయండి.. సిబ్బందికి ట్విటర్ ఆదేశం
Follow us on

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కోవిడ్-19 తీవ్రతకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్… ట్విటర్ కూడా ‘భయపడిపోయినట్టు కనిపిస్తోంది’. వచ్ఛే సోమవారం నుంచి తమ సిబ్బంది అంతా తమ ఇళ్ల నుంచే పని  చేయాలని ఆదేశించింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా తమ స్టాఫ్ కి వర్తిస్తుందని పేర్కొంది. కరోనా వ్యాపించకుండా నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్విటర్ హ్యూమన్ రిసోర్సెస్ చీఫ్ జెన్నిఫర్ క్రిస్టీ తెలిపారు. వైరస్ ప్రబలంగా ఉన్న ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా ఇదే విధమైన అభ్యర్థనలు చేశాయి. ఇక మా ఉద్యోగులంతా ఇళ్ల నుంచి పని చేసేలా వారిని ప్రోత్సహిస్తున్నామని జెన్నిఫర్ తమ బ్లాగ్ లో పేర్కొన్నారు. ‘ మాకే కాదు.. వరల్డ్ వైడ్ గా కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా చూడాలన్నదే మా లక్ష్యం’ అని జెన్నిఫర్ అన్నారు.

దక్షిణ కొరియా, హాంకాంగ్, జపాన్ కార్యాలయాల్లో ట్విటర్ సిబ్బంది అందరూ తప్పనిసరిగా ఇళ్ల నుంచి  పని చేయాల్సి ఉంటుంది. సౌత్ కొరియాలో ఇప్పటికే ఐదువేల కరోనా కేసులు నమోదు కాగా…  సుమారు 30 మంది మృత్యువాత పడ్డారు. జపాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా స్కూళ్లను మూసివేయాలని ఆదేశించింది. పైగా ఇళ్ల నుంచి పని చేసేందుకు ఆయా సంస్థల యజమానులు తమ సిబ్బందిని అనుమతించాలని కూడా సూచించింది. హాంకాంగ్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.