Donald Trump: ఇరాన్‌ దాడిలో సత్తా లేదు.. 14 క్షిపణుల్లో 13 కూలిపోయాయి- అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌!

ఖతార్‌లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరంపై ఇరాన్ ప్రతీకార దాడులపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ఇరాన్ క్షిపణి దాడిలో అమెరికన్స్‌కు కానీ, ఖతార్ సిబ్బందికి కానీ ఎవరూ గాయపడలేదని ట్రంప్ అన్నారు. ఇరాన్ ప్రతీకార చర్య చాలా బలహీనంగా ఉందని.. ఇరాన్ పంపిన 14 క్షిపణులలో 13 క్షిపణులను తాము అడ్డగించామని ట్రంప్ చెప్పుకొచ్చారు.

Donald Trump: ఇరాన్‌ దాడిలో సత్తా లేదు.. 14 క్షిపణుల్లో 13 కూలిపోయాయి- అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌!
Donald Trump

Updated on: Jun 24, 2025 | 2:30 AM

ఇరాన్-ఇజ్రాయోల్ యద్దం మద్య తలదూర్చిన అమెరికా మెన్న ఇరాన్‌లోని 3 ప్రధాన అణకేంద్రాలపై దాడికి పాల్పడింది. దీంతో సోమవారం ఇరాన్ అమెరికాపై ప్రతీకార దాడులను ప్రారంభించింది. ఈ దాడుల్లో భాగంగా ఖాతార్‌, ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా చేసుకొని ఇరాన్ మిసైళ్లు, క్షిపణులతో దాడులకు పాల్పడింది. అయితే తాగాజా ఇరాన్ దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇరాన్ చేసిన ప్రతీకార దాడి చాలా బలహీనంగా ఉందని ఆయన అన్నారు. ఇరాన్ ప్రయోగించిన 14 మిసైళ్లలో 13 మిసైళ్లను తాము అడ్డుకున్నట్టు ఎక్స్‌ వేదికగా రాసుకొచ్చారు.

ఖతార్, ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడుల తర్వాత, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ఇది చాలా బలహీనమైన ప్రతీకార చర్య అని.. తాను దీనిని ఊహించలేదని తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో ట్రంప్‌ పేర్కొన్నారు. ఇరాన్ అణు సౌకర్యాలను తమ సైనిక స్థావరాలపై 14 క్షిపణులను ప్రయోగించిందని ట్రంప్ ధృవీకరించారు. వాటిలో 13 క్షిపణులను తాము సమర్ధవంతంగా అడ్డుకున్నట్టు తెలిపాడు. ఇరాన్ తమకు ముందస్తుగా ఇచ్చిన హెచ్చరిక సంకేతాల వల్లే ఈ విజయవంతమైన ఫలితం సాధ్యమైందని ట్రంప్ తెలిపారు. అమెరికన్లలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని, నష్టం కూడా తక్కువగానే జరిగిందని తెలిపారు.

తమకు ముందస్తు సమాచారం ఇచ్చినందుకు ఇరాన్‌కు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని ట్రంప్ అన్నారు, ఇరాన్ హెచ్చరికల వల్లనే ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా, గాయపడకుండా జాగ్రత్త పడగలిగాలమని అని ట్రంప్ అన్నారు. “బహుశా ఇరాన్ ఇప్పుడు ఈ ప్రాంతంలో శాంతి సామరస్యాన్ని కొనసాగించవచ్చుని తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..