చాలా పెద్ద తప్పు చేశాం మమ్మల్ని క్షమించండి.. జస్టీన్ ట్రూడో భావోద్వేగ వ్యాఖ్యలు

పార్లమెంట్‌లో జెలెన్‌స్కీ ప్రసంగం చేసిన తర్వాత స్పీకర్‌ రోటా స్వయంగా అతడిని పరిచయం చేస్తూ.. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో రష్యా నుంచి ఉక్రెయిన్‌కు స్వేచ్చను అందించేందుకు పోరాడినటువంటి యోధుడిగా ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో అక్కడే ఉన్నటువంటి ప్రధాని జస్టిన్‌ ట్రూడో, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జలెన్‌స్కీ‌తో పాటు అందరూ కూడా చప్పట్లు కొడుతూ లేచి నిలబడ్డారు. అయితే పార్లమెంట్‌ గౌరవించినటువంటి యారోస్లోవ్ హంకా రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీ నియంత అయిన హిట్లర్‌ తరపున పోరాడిన .. 14వ వాఫన్‌ గ్రనేడియర్‌ డివిజన్‌‎కు చెందినటువంటి వ్యక్తి అని ఆ తర్వాతా తెలిసింది.

చాలా పెద్ద తప్పు చేశాం మమ్మల్ని క్షమించండి.. జస్టీన్ ట్రూడో భావోద్వేగ వ్యాఖ్యలు
Justin Trudeau

Updated on: Sep 28, 2023 | 3:17 PM

ఓ వైపు ఖలిస్థానీ విషయంలో భారత్‌తో వివాదం కొనసాగుతున్న వేళ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో నాజీ అంశం వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ట్రూడో ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తున్న స్పీకర్‌ తన పదవికి రాజీనామా చేసేలా దారితీసింది. అయితే ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాజాగా ట్రూడో.. బహిరంగ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అంతేకాదు ఉక్రెయిన్‌ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పడానికి కూడా ఇప్పటికే దౌత్యమార్గాల ద్వారా చర్చలు జరిపారు. ఇదిలా ఉండగా.. రష్యాతో యుద్ధం మొదలైన అనంతరం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవల కెనడా దేశంలో పర్యటటన చేశారు. అయితే ఈ సందర్భంగా ఆయన గత శుక్రవారం నాడు కెనడా పార్లమెంట్‌కు వచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి స్పీకర్‌ ఆంటోనీ రోటా.. ఉక్రెయిన్‌ నుంచి వలస వచ్చినటువంటి రెండో ప్రపంచ యుద్ధం మాజీ సైనికుడైన 98 ఏళ్ల యారోస్లోవ్‌ హంకాకు ఆహ్వానం పలికారు.

అలాగే పార్లమెంట్‌లో జెలెన్‌స్కీ ప్రసంగం చేసిన తర్వాత స్పీకర్‌ రోటా స్వయంగా అతడిని పరిచయం చేస్తూ.. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో రష్యా నుంచి ఉక్రెయిన్‌కు స్వేచ్చను అందించేందుకు పోరాడినటువంటి యోధుడిగా ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో అక్కడే ఉన్నటువంటి ప్రధాని జస్టిన్‌ ట్రూడో, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జలెన్‌స్కీ‌తో పాటు అందరూ కూడా చప్పట్లు కొడుతూ లేచి నిలబడ్డారు. అయితే పార్లమెంట్‌ గౌరవించినటువంటి యారోస్లోవ్ హంకా రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీ నియంత అయిన హిట్లర్‌ తరపున పోరాడిన .. 14వ వాఫన్‌ గ్రనేడియర్‌ డివిజన్‌‎కు చెందినటువంటి వ్యక్తి అని ఆ తర్వాతా తెలిసింది. దీనివల్ల ఈ ఘటనపై జస్టీన్ ట్రూడో ప్రభుత్వం తీవ్రంగా విమర్శలు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిణామం అనంతరం మంగళవారం రోజున స్పీకర్ రోటా పదవికి రాజీనామా చేసేశారు. అయినా కూడా ఈ వివాదం మాత్రం ఎమాత్రం చల్లారలేదు. ఇక చివరికి ట్రూడో బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.

ఇదిలా ఉండగా.. శుక్రవారం రోజున జరిగినటువంటి ఘటనకు ఈ సభ తరపున బేషరతుగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాని అన్నారు. అలాగే ఈ విషయంలో ఇప్పటికే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఆ దేశ ప్రతినిధి బృందాన్ని దౌత్యమార్గాల ద్వారా సంప్రదించినట్లు పేర్కొన్నారు. అయితే ఆ రోజున పార్లమెంట్‌కు వచ్చిన వ్యక్తిని గుర్తించే విషయంలో ఘోర తప్పిదం జరిగిందని తెలిపారు. అయితే నాజీ పాలన విషయంలో తీవ్రంగా నష్టపోయినటువంటి వారి చేదు జ్ఞాపకాలను విస్మరించినట్లు అయ్యిందని అని ట్రూడో విచారాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. కెనడా పార్లమెంట్‌లో నాజీ సైనికుడికి జరిగినటువంటి సత్కారాన్ని కూడా రష్యా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఉక్రెయిన్ లక్ష్యాన్ని తప్పుదారి పట్టించడానికి రష్యా ఈ తప్పిదాన్ని రాజకీయం చేస్తోందని ట్రూడో అన్నారు. అలాగే ఇందుకు సంబంధించిన విషయంలో నాకు ఇబ్బందిగా ఉందని అని ట్రూడో ఓ సారి మీడియా సమావేశంలో వాపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.