Trending News: ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్.. తిరిగి టేకాఫ్ కు నో చెప్పిన పైలెట్.. ఎందుకో తెలిస్తే ఫ్యూజులు ఔట్!

|

Jan 21, 2022 | 2:54 PM

పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) పైలట్, ఆదివారం అత్యవసర ల్యాండింగ్ చేసిన తర్వాత, తన షిఫ్ట్ అయిపోయిందని చెప్పి టేకాఫ్ చేయడానికి నిరాకరించాడు.

Trending News: ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్.. తిరిగి టేకాఫ్ కు నో చెప్పిన పైలెట్.. ఎందుకో తెలిస్తే ఫ్యూజులు ఔట్!
Pakistan Pilot Refuses To Fly
Follow us on

Viral News: ఓ ఫైలెట్ ఏకంగా విమాన ప్రయాణికులకు షాకిచ్చాడు. ప్రయాణం మధ్యలో భయపెట్టడంతోపాటు వారి ఆగ్రహానికి కూడా కారణం అయ్యాడు. దీంతో ప్రయాణికులకు, ఫైలెట్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి దిగజారడంతో అధికారులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. అసలు విషయంలోకి వెళ్తే..  పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) పైలెట్, ఆదివారం అత్యవసర ల్యాండింగ్ చేసిన తర్వాత, తన షిఫ్ట్ అయిపోయిందని చెప్పి టేకాఫ్ చేయడానికి నిరాకరించాడు. ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ప్రకారం, PK-9754 విమానం రియాద్ నుంచి బయలుదేరింది. ఇస్లామాబాద్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా విమానాన్ని సౌదీ అరేబియాలోని దమ్మాంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన తర్వాత పైలట్ టేకాఫ్ చేసేందుకు నిరాకరించడంతో సమస్య తలెత్తింది.

సదరు పైలట్ తన డ్యూటీ అవర్స్ అయిపోయాయని పేర్కొంటూ విమానాన్ని టేకాఫ్ చేయకుండా నిరాకరించినట్లు స్థానిక మీడియా నివేదించింది. మరోవైపు విమానంలోని ప్రయాణీకులు దిగడానికి నిరాకరించారు. వారి ప్రయాణంలో జాప్యంపై నిరసన ప్రదర్శించినట్లు పేర్కొంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో సమస్యను కొలిక్కి తెచ్చేందుకు దమ్మాం విమానాశ్రయ భద్రతా సిబ్బందిని పిలిచారు.

దీంతో అక్కడి సిబ్బంది వచ్చి ప్రయాణికులకు నచ్చ చెప్పి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నం చేశారు. దుబాయ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులు పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌కు తమ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించే వరకు హోటల్‌లోనే బస చేశారు.

“విమాన భద్రత కోసం పైలట్ విశ్రాంతి తీసుకోవాలి. ప్రయాణికులందరూ రాత్రి 11 గంటలకు ఇస్లామాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అప్పటికే హోటళ్లలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి” అని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ప్రకటించారు.

పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ గతేడాది నవంబర్‌లో సౌదీ అరేబియాకు విమాన కార్యకలాపాలను విస్తరించింది.

ఎమర్జెన్సీ ల్యాండింగ్ తర్వాత ప్రయాణికులు చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం నవంబర్‌లో, ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో యూఎస్‌కి వెళ్లే వారి విమానంలో ఇంజిన్ వైఫల్యంతో అత్యవసర ల్యాండింగ్ చేసినప్పుడు డజన్ల కొద్దీ ప్రజలు ఐరోపాలో చిక్కుకుపోయారు.

Also Read: AP Express Train: ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. గంటకుపైగా ఆగిన ట్రైన్.. ప్రయాణీకుల్లో టెన్షన్!

Republic Day: ఆంధ్రప్రదేశ్ కళాకారుడికి జాతీయ స్థాయిలో గుర్తింపు.. ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లో కలంకారీ పెయింట్స్ ప్రదర్శన.