భారత్, కెనడాల మధ్య నెలకొన్న వివాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఖలిస్థాన్ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు విషయంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో తమ దేశానికి క్లీన్ ఇమేజ్‌ను సృష్టించుకునే పనిలో పడింది కెనడా. ఈ క్రమంలోనే అక్కడి అధికారులు తలమునకలయ్యారు. ఒకవైపు భారత్ సైతం కెనడా ఖలిస్థాని ఉగ్రవాదులకు కేంద్రంగా మారినట్లు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కెనడా అధికారుల్లో మరింతగా ఆందోళన పెరిగింది. అయితే ఈ క్రమంలోనే బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో గురుద్వారా వద్ద ఉన్నటువంటి ఖలిస్థానీ బెదిరింపు పోస్టర్లను తొలగించేటటువంటి పనిలో పడ్డారు.
ఇదిలా ఉండగా ఈ ఏడాది జూన్ నెలలో ఖలిస్థాని ఉగ్రవాది అయిన హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌ను ఇద్దరు గన్‌మెన్లు కాల్చిచంపేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగిన అనంతరం.. ముగ్గురు భారతీయ దౌత్యవేత్తలను హత్యచేయాలని పిలుపునిస్తూ.. సర్రే ప్రాంతంలో గురుద్వార పరిసరాల్లో భారీ పోస్టర్లు, బిల్‌బోర్డులు దర్శనమిచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆ పోస్టర్లు, బిల్‌బోర్డులను తొలంగించాలని స్థానిక అధికారులు గురుద్వారా వర్గాలపై ఒత్తిడి తీసుకొచ్చారు. అంతేకాదు.. రాడికల్ ప్రకటనలకు కూడా లౌడ్‌స్పీకర్‌ను వినియోగించకూడదని ఆంక్షలు కూడా విధించారు. అయితే ప్రస్తుతం అక్కడ కొంతమంది వ్యక్తులు.. ఈ పోస్టర్లను తొలిగిస్తున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇదిలా ఉండగా.. మరోవైపు ఖలిస్థానీ గ్రూపుల నుంచి వస్తున్న బెదిరింపుల విషయాన్ని సైతం భారత్ బలంగా లేవనెత్తడం వల్ల పోస్టర్లను తొలిగించే ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల సిఖ్స్ ఫర్ జస్టీస్ అధినేత పన్నూ బెదిరింపులు.. అలాగే కెనడా ప్రధాని జస్టీన్ ట్రూడో సొంత మంత్రివర్గంలోనే ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు చేపట్టడం చర్చనీయాంశమవుతోంది. ఇదిలా భారత్, కెనడాల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో ఇరుదేశాలు కూడా దౌత్యవేత్తలను బహిష్కరించాయి. మరోవైపు జీ7 దేశాలు కూడా ఈ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.
News: 🇨🇦 Amidst rising tensions between India and Canada, authorities have issued a directive to a radical stronghold Gurdwara, urging the immediate removal of all contentious banners.
These banners had previously called for the assassination of three Indian diplomats and… pic.twitter.com/nYSO6fuUKd
— Norbert Elikes (@NorbertElikes) September 23, 2023
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..