Chained Tree in Peshawar: 125 యేళ్లుగా ఇనుప సంకెళ్లలోనే.. బందీగా ఆ మర్రిచెట్టు.. ! ఇంతకీ ఏ నేరం చేసిందంటే..

|

Jan 07, 2024 | 1:13 PM

ఎవరైనా నేరం చేస్తే పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టు వారి నేర తీవ్రతను బట్టి శిక్షను విధిస్తుంది. ఇక జైలు నుంచి ఖైదీని బయటకు తీసుకెళ్తే.. తప్పించుకోకుండా సంకెళ్లు వేసి తీసుకెళ్లారు. సాధారణంగా ఇది ఏ దేశంలోనైనా కనిపించే దృశ్యం. కానీ మనిషిని అరెస్ట్‌ చేసినట్లు చెట్టును అరెస్ట్‌ చేస్తే.. అందేంటీ అనుకుంటున్నారా? అవునండీ.. నిజంగానే ఓ చెట్టును వందేళ్లకు పైగా అరెస్ట్ చేశారు..

Chained Tree in Peshawar: 125 యేళ్లుగా ఇనుప సంకెళ్లలోనే.. బందీగా ఆ మర్రిచెట్టు.. ! ఇంతకీ ఏ నేరం చేసిందంటే..
Chained Tree Of Peshawar
Follow us on

పెషైర్, జనవరి 7: ఎవరైనా నేరం చేస్తే పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టు వారి నేర తీవ్రతను బట్టి శిక్షను విధిస్తుంది. ఇక జైలు నుంచి ఖైదీని బయటకు తీసుకెళ్తే.. తప్పించుకోకుండా సంకెళ్లు వేసి తీసుకెళ్లారు. సాధారణంగా ఇది ఏ దేశంలోనైనా కనిపించే దృశ్యం. కానీ మనిషిని అరెస్ట్‌ చేసినట్లు చెట్టును అరెస్ట్‌ చేస్తే.. అందేంటీ అనుకుంటున్నారా? అవునండీ.. నిజంగానే ఓ చెట్టును వందేళ్లకు పైగా అరెస్ట్ చేశారు. పైగా ఆ చెట్టు తప్పించుకోకుండా గట్టి ఇనుప సంకెళ్లతో బంధించారు కూడా. ఈ విచిత్ర చెట్టు మన దాయాది దేశమైన పాకిస్థాన్‌లో ఉంది. లాండి కోటల్ ఆర్మీ కంటోన్మెంట్‌లో ఉన్న మర్రి చెట్టు 125 ఏళ్లుగా బందీగా ఉంది. ఈ చెట్టు వద్ద “నేను అరెస్టులో ఉన్నాను” అని రాసి ఉన్న బోర్డు కూడా కనిపిస్తుంది. ఇంతకీ అంత పెద్ద నేరం ఏం చేసి ఉంటుందనేగా ఆలోచిస్తున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఈ చెట్టు ఉంది. చేతికి సంకెళ్లు వేసినట్లు ఈ చెట్టుకు కూడా ఇనుప సంకెళ్లు వేసి ఉంటాయి. ఈ చెట్టు 1899 నుంచి ఈ విధంగా అరెస్టులో ఉంది. దీనికి ఈ విధమైన శిక్ష విధించింది జేమ్స్ స్క్విడ్ అనే బ్రిటిష్ అధికారి. అతను మద్యం మత్తులో ఉండగా ఈ చెట్టు తన వెనుక తిరుగుతున్నట్లు అనిపించింది. అసలే అధికారి కదా మరి.. దీంతో చెట్టును స్వాధీనం చేసుకుని, సంకెళ్లతో బంధించమని మెస్ సార్జెంట్‌ని ఆదేశించాడు. అప్పటి నుంచి ఈ మర్రి చెట్టు గొలుసులతో బంధించి ఉంది. ప్రస్తుతం ఈ చెట్టు ఖైబర్ రైఫిల్స్ ఆఫీసర్స్ మెస్‌లో ఉంది. నేటికీ చాలా మంది పర్యాటకులు ఆ చెట్టును చూసేందుకు వెళ్తుంటారు. ఈ చెట్టు బ్రిటిష్ అణచివేతకు ప్రతీక అని అక్కడి స్థానికులు చెబుతుంటారు. ఆ దేశ ప్రజలు బ్రిటిష్ వారి అణచివేతకు ఎంతగా గురయ్యారో చూపించేందుకు ఈ చెట్టును నిదర్శనంగా చూపుతారు.

నాటి నుంచి పెషావర్‌లోని చైన్డ్ ట్రీ ఒక ముఖ్యమైన మైలురాయిగా మారింది. ఆర్మీ కంటోన్మెంట్ నివాసి అమ్రాన్ షిన్వార్ మీడియాతో మాట్లాడుతూ.. ఇది అక్కడి గిరిజన ప్రజలను బెదిరించే విధంగా ఉందని పేర్కొన్నాడు. ఎవరైనా బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎదురు తిరిగే ధైర్యం చేస్తే, వారు కూడా అదే పద్ధతిలో శిక్షించబడతారని ప్రతీకరగా ఈ చెట్టును చూపుతారని” అని ఆయన అన్నారు. ఈ మర్రి చెట్టు ఫ్రాంటియర్ క్రైమ్స్ రెగ్యులేషన్స్‌కు చిహ్నంగా భావిస్తారు. 1901లో బ్రిటిష్ వారు తీసుకొచ్చిన క్రూరమైన వలసరాజ్యాల చట్టాన్ని ధిక్కరించిన లేదా ఏ విధంగానైనా వలస పాలనకు వ్యతిరేకంగా ప్రయత్నించిన స్థానికులను ఈ విధంగా శిక్షిస్తామని ప్రతీకగా ఈ చెట్టును బంధించి ఉంచినట్లు ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.