Catacombs: ఇదేం పైత్యమో.. పుర్రెలు, ఎముకల మధ్య వివాహం చేసుకున్న జంట! భయానక ప్రదేశంలో రొమాన్స్

|

Nov 12, 2023 | 5:31 PM

వెర్రి వెయ్యి విధాలని అంటుంటాం. వీరిని చూస్తూ అది నిజమేనని మరోమారు రుజువయ్యింది. సాధారణంగా బంధుమిత్రుల మధ్య, పచ్చని తోరణాలు కట్టిన ఊరంత పందిరిలో పెళ్లి వేడుకలు జరుపుకుంటారు. శుభకార్యం కళ ఉట్టిపడేలా ఘనంగా వేడుకగా జరుపుకుంటారు. కానీ.. ఈ రోజుల్లో వివాహాలు కూడా డెస్టినేషన్ బేస్డ్‌గా మారాయనే సంగతి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఇంట్లో పెళ్లి వేడుకలంటే బంధువులను పిలుచుకుని, వారిందరి సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు చాలా వివాహాలు..

Catacombs: ఇదేం పైత్యమో.. పుర్రెలు, ఎముకల మధ్య వివాహం చేసుకున్న జంట! భయానక ప్రదేశంలో రొమాన్స్
Couple Got Married At Catacombs
Follow us on

ప్యారిస్‌, నవంబర్‌ 12: వెర్రి వెయ్యి విధాలని అంటుంటాం. వీరిని చూస్తూ అది నిజమేనని మరోమారు రుజువయ్యింది. సాధారణంగా బంధుమిత్రుల మధ్య, పచ్చని తోరణాలు కట్టిన ఊరంత పందిరిలో పెళ్లి వేడుకలు జరుపుకుంటారు. శుభకార్యం కళ ఉట్టిపడేలా ఘనంగా వేడుకగా జరుపుకుంటారు. కానీ.. ఈ రోజుల్లో వివాహాలు కూడా డెస్టినేషన్ బేస్డ్‌గా మారాయనే సంగతి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఇంట్లో పెళ్లి వేడుకలంటే బంధువులను పిలుచుకుని, వారిందరి సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు చాలా వివాహాలు కళ్యాణ మండపంలో కాకుండా డెస్టినేషన్ బేస్డ్‌గా జరుగుతున్నాయి. అయితే ఈ జంట మాత్రం మరో అడుగు ముందుకేసి కాస్తింత వెరైటీగా పెళ్లి చేసుకున్నారు. వీళ్లు ఎంచుకున్న స్థలం వింటే మీ గుండెలు దడదడ లాడిపోతాయ్‌. అలాంటి స్థలాన్ని ఎంచుకుంటారు మరీ.. ప్రస్తుతం వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మీరూ తెలుసుకోండి..

ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో ‘క్రిప్ట్ ఆఫ్ టోంబ్స్’గా పిలిచే ఓ భయంకర ప్రదేశం ఉంది. అక్కడికి వెళ్లడానికి మహా మహా ముదుర్లే దడుసుకుంటారు. అటువంటి భయానక ప్రదేశంలో ఒక అమెరికన్ జంట వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. ఈ జంట హాలోవీన్ సందర్భంగా వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. వధువు ఇసాబెల్.. ఒక నిమిషం 30 సెకన్ల వ్యవధి కలిగిన వీడియోను సోషల్ మీడియాలో @ohmyisabel4ever అనే ఐడీతో షేర్ చేసింది. అక్కడ మిలియన్ల కొద్దీ మృతదేహాల ఎముకలు, పుర్రెల మధ్య తన ప్రియుడు జస్టిన్‌ను ఎలా వివాహం చేసుకుందో చెప్పుకొచ్చింది.

ఈ జంట రాత్రి భోజనం తర్వాత పెళ్లి చేసుకోవడానికి తామిద్దరితోపాటు సాక్షిగా మరో వ్యక్తిని కూడా తీసుకెళ్లారు. హాలోవీన్ సమూహం నుంచి తప్పించుకోవడానికి ఓ రహస్య మార్గం ద్వారా నేలమాళిగలోపలికి వెళ్లినట్లు వధువు ఇసాబెల్ తెల్పింది. ఈ జంట వివాహ సాక్షిగా తమ స్నేహితుడితోపాటు ఓ ప్రొఫెషనల్ టూర్ గైడ్‌తో కలిసి ఈ భయానక నేలమాళిగకు వెళ్లినట్లు చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అక్కడున్న ఎముకలు, పుర్రెల నడుమ పెళ్లి చేసుకుని ఫోటోషూట్ కూడా చేసుకున్నట్లు తెల్పింది. ఇందుకు సంబంధించిన పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయినా ఇదేం పైత్యం.. పుర్రెలు, అస్థిపంజరాల మధ్య ప్రేత పెళ్లిలా ఉందంటూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఆ భయానక ప్రదేశం పేరు ‘ఫ్రెంచ్ కాటాకాంబ్స్’
‘ఫ్రెంచ్ కాటాకాంబ్స్’ పారిస్‌లో ఉంది. చనిపోయిన 6 మిలియన్ల మంది వ్యక్తుల ఎముకలు, పుర్రెలను ఈ గుహలో ఉంచినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ గుహ భూమి నుంచి 20 మీటర్ల లోతులో నిర్మించబడింది. ఇక్కడ ఎటు చూసినా ఎముకలు, పుర్రెలు భయంకరంగా ఉంటాయి. దారి పొడవునా రెండు వైపులా రెండు కిలోమీటర్ల మేర ఎముకలు, పుర్రెలతో గోడను నిర్మించి అలంకరించారు. చూసేందుకు ఈ ప్రదేశం చాలా భయానకంగా ఉంటుంది. నిజానికి ఇదొక టూరిస్టు ప్లేస్‌. ధైర్యం ఉన్నవాళ్లు మాత్రమే ఇక్కడికి రావడానికి ఇష్టపడతారు. అటువంటి స్థలంలో ఈ జంట వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్య పరిచారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.