Trump Tariff: ఎంత పని చేశావయ్యా..ట్రంప్ దెబ్బకు అల్లాడుతున్న అమెరికన్లు.. అసలు పనికే ఎసరు పెట్టాడు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా టారిఫ్ విధింపుల విషయంలో ట్రంప్ నిర్ణయాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో అమెరికాలో పలు ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగిపోనున్నాయి. అందులో ఒకటి అక్కడి పౌరులకు అత్యవసరమయ్యే టాయిలెట్ పేపర్ కూడా ఉంది. టారిఫ్ దెబ్బకు అక్కడి మిల్లులు మూతపడ్డాయి. దీంతో ఈ పేపర్ల తయారీ నిలిచిపోనుంది.

Trump Tariff: ఎంత పని చేశావయ్యా..ట్రంప్ దెబ్బకు అల్లాడుతున్న అమెరికన్లు.. అసలు పనికే ఎసరు పెట్టాడు..
Donald Trump Tariff Effects Toilet Paper

Updated on: Mar 30, 2025 | 12:25 PM

అమెరికా ప్రజల కోసం ఆ దేశాధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాలు వారిని కొత్త కష్టాల్లోకి నెడుతున్నాయి. తాజాగా ఆ దేశస్థులకు ట్రంప్ వల్ల చెప్పుకోలేని కష్టాలు మొదలయ్యాయి. రెండో సారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఏదో చేసేస్తాడని కలలు కన్న అక్కడి వారికి ఆయన తీసుకునే నిర్ణయాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో అక్కడి పౌరుల ప్రయోజనాలకు ట్రంప్ అడ్డుకట్ట వేస్తున్నాడా అనే సందేహాలు మొదలవుతున్నాయి. ఇక తాజా విషయానికి వస్తే ట్రంప్ దెబ్బతో అమెరికాలో టాయిలెట్ పేపర్ కు భారీగా కొరత ఏర్పడనుంది.

అమెరికాలోనే ఎందుకు?

అమెరికాలో దాదాపు 10 శాతం టాయిలెట్ పేపర్ దిగుమతి అవుతుంది, దానిలో సగం కెనడా నుంచి వస్తుంది. ట్రంప్ ప్రభుత్వం కెనడా నుంచి దిగుమతి చేసుకునే కలపపై 27 శాతం అదనపు సుంకం విధిస్తే దాని ప్రభావం నార్త్‌ బ్లీచ్డ్ సాఫ్ట్‌వుడ్ క్రాఫ్ట్ పల్ప్ ఎన్‌బీఎస్కెపై పడుతుంది. అమెరికన్ టాయిలెట్ పేపర్, ఇతర పేపర్‌ వస్తువుల తయారీకి అవసరమైన ముడి పదార్థం ఇది. బ్లూమ్‌బెర్గ్ ఈ మేరకు చెప్తోంది.

ట్రంప్  దెబ్బకు మిల్లులు మూతపడ్డాయి..

నివేదిక ప్రకారం, గత సంవత్సరం అమెరికా 2 మిలియన్ టన్నుల కెనడియన్ ఎన్‌బీఎస్కెని దిగుమతి చేసుకుందని గ్లోబల్ పల్ప్ మార్కెట్ సరఫరాదారుల అధ్యక్షుడు బ్రయాన్ మాక్‌క్లే తెలిపారు. మాక్‌క్లే, “అమెరికాలోని చాలా పేపర్ మిల్లులు కెనడియన్ సాఫ్ట్‌వుడ్ కలపపై ఆధారపడతాయి. ఇక్కడి మిల్లులు 30 సంవత్సరాలుగా దీన్ని ఉపయోగిస్తున్నాయి. వారు దీనిలో ఎటువంటి మార్పు కోరుకోరు. కలపపై 50 శాతం కంటే ఎక్కువ సుంకం విధించినట్లయితే దాని తీవ్ర పరిణామాలు ఉంటాయి. దీని వల్ల అనేక మిల్లులు మూతపడతాయి” అని చెప్పారు.

టాయిలెట్ పేపర్ దొరకట్లేదు..

మాక్‌క్లే, “మేము కెనడాలో పల్ప్ తయారీకి చెట్లను నరకము, కాబట్టి మేము మిల్లుల నుంచి వచ్చే మిగిలిన కలప ముక్కలపై ఆధారపడతాము. దీని వల్ల టాయిలెట్ పేపర్ ఖర్చు పెరుగుతుంది. ఉత్పత్తి తగ్గుతుంది. డోనాల్డ్ ట్రంప్ పదే పదే టారిఫ్‌లను పెంచే బెదిరింపులు చేస్తూ తన దేశానికి కెనడియన్ కలప అవసరం లేదని చెప్పారు. క్యూబెక్ (కెనడాలోని ఒక నగరం)కు చెందిన ఒక వ్యాపారవేత్త అమెరికా ప్రజలు కెనడియన్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి కారణం అవి అత్యుత్తమమైనవి కాబట్టి అని చెప్పారు.