Antarctica: నాలుగు నెలలు గాఢ అంధకారం.. సుదీర్ఘ విరామం తర్వాత సూర్యోదయం.. ఫోటోలు విడుదల

మంచుతో కప్పబడి ఉండే అంటార్కిటికా (Antarctica) లో తొలి సూర్యోదయం నమోదైంది. నాలుగు నెలల అంధకారం తర్వాత అక్కడ వెలుతురు నెలకొంది. చలికాలంలో చీకటి, వేసవి కాలంలో పగలు ఉండే అంటార్కిటికాలో శీతాకాలం కంప్లీట్ అయింది. ఈ మేరకు..

Antarctica: నాలుగు నెలలు గాఢ అంధకారం.. సుదీర్ఘ విరామం తర్వాత సూర్యోదయం.. ఫోటోలు విడుదల
Sunrise In Antarctica

Updated on: Aug 23, 2022 | 6:55 AM

మంచుతో కప్పబడి ఉండే అంటార్కిటికా (Antarctica) లో తొలి సూర్యోదయం నమోదైంది. నాలుగు నెలల అంధకారం తర్వాత అక్కడ వెలుతురు నెలకొంది. చలికాలంలో చీకటి, వేసవి కాలంలో పగలు ఉండే అంటార్కిటికాలో శీతాకాలం కంప్లీట్ అయింది. ఈ మేరకు అంటార్కిటికాలో సూర్యుడి కిరణాలు పడినట్లు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. సాధారణంగా అంటార్కిటికాలో ఆగస్టులో శీతాకాలం ముగుస్తుంది. దీంతో ఈ నెలలోనే భానుడు తన కిరణాలను ప్రసరింపజేస్తాడు. ఈ క్రమంలో నాలుగు నెలల సుదీర్ఘ సమయం తర్వాత తొలి సూర్యోదయం నమోదైంది. ఈ మేరకు అక్కడ తీసిన ఫొటోను యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (European Space Agency) రిలీజ్ చేసింది. అంటార్కిటికాలో వేసవి, శీతాకాలాలు రెండే ఉంటాయి. మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అంటార్కిటికాలో మే నెలలో శీతాకాలం మొదలవుతుంది. టెంపరేచర్ మైనస్ 70, 80 డిగ్రీలకు పడిపోతాయి. ఆగస్టు వరకు అక్కడ నాలుగు నెలలపాటు గాఢ అంధకారం నెలకొంటుంది. కాగా ఈ కాలాన్ని సైంటిస్టులు తమకు ఉపయోగకరమైనవి గా మార్చుకుంటారు. బయోమెడికల్ పరిశోధనలతోపాటు వివిధ అంశాలపై పరిశోధనలు చేస్తారు. వాతావరణాల మార్పులు, మానవ మనుగడ వంటి అంశాలను అధ్యయనం చేస్తారు.

మరోవైపు.. కాంకార్డియా పరిశోధన కేంద్రంలో ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) పరిశోధకులు మే నెలలో పరిశోధనలు ప్రారంభించారు. చలికాలపు 4 నెలల చీకట్లలో విస్తృత పరిశోధనలు చేసేందుకు 12 మందితో కూడిన సైంటిస్టుల బృందం అక్కడికి పయనమైంది. పూర్తిగా చీకట్లు 4 నెలల పాటు చీకటే కమ్ముకొని ఉంటుంది. అంటార్కిటికాలో ఉండే పరిశోధకుల ఆరోగ్య స్థితిగతులు ఎలా మారుతాయి? జీవక్రియలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? అనే విషయాలపై పరిశోధనలు చేస్తారు. గుండె పనితీరులో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి అనే అంశంపై ప్రయోగాలు చేస్తారు. భవిష్యత్ లో మార్స్ పై వెళ్లేందుకు చేసే మిషన్ శిక్షణ కోసం అంటార్కిటికా చలికాలం రాత్రులు చక్కగా ఉపయోగపడతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us