క్రికెట్‌లో ఆ షాట్‌ను రద్దు చేయాలి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్..

|

Dec 02, 2020 | 5:18 AM

'స్విచ్ హిట్టింగ్‌' షాట్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

క్రికెట్‌లో ఆ షాట్‌ను రద్దు చేయాలి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్..
Follow us on

ian chapel coments: ‘స్విచ్ హిట్టింగ్‌’ షాట్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ షాట్ సరైనది కాదని, న్యాయవిరుద్ధమైన షాట్‌ అని, ఇది ఫీల్డింగ్ చేసే జట్టుకు నష్టం చేకూరుస్తుందని తెలిపారు. వెంటనే ఈ షాట్‌ని రద్దు చేయాలని ఐసీసీకి సూచించారు.

బౌలర్ బాల్ వేసేటపుడు రైట్‌హ్యాండ్ బ్యాట్స్‌మెన్, లెప్ట్ హ్యాండ్‌కు వచ్చి ఆడటాన్ని ‘స్విచ్ హిట్టింగ్‌’ అంటారు. ఇటీవల జరిగిన భారత్, ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్, డేవిడ్ వార్నర్ చాలాసార్లు ‘స్విచ్ హిట్టింగ్‌’తో పరుగులు రాబట్టారు. అయితే బౌలింగ్ చేసేముందు బౌలర్ ఏ విధంగా బౌల్ చేస్తున్నాననే విషయం ఎంఫైర్‌కు చెప్పినట్లుగానే బ్యాట్స్‌మెన్ కూడా ‘స్విచ్ హిట్టింగ్‌’ గురించి ఎంఫైర్‌కు ముందుగానే తెలియజేయాలని సూచించారు. అప్పుడే ఇరు జట్లకు సమన్యాయం జరగినట్లుగా ఉంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. బ్యాట్స్‌మెన్ తన హ్యాండ్ మార్చడం వల్ల ఫీల్డర్ల స్థానాలను కన్‌ప్యూజ్ చేసి బ్యాటింగ్ చేసే జట్టు అధిక పరుగులు రాబట్టుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై ఆటగాళ్లు ఇప్పటికీ ఫిర్యాదు చేయకపోవడం తనకు ఆశ్చర్యకరంగా ఉందని తెలిపారు. అయితే గ్లెన్ మాక్స్‌వెల్, డేవిడ్ వార్నర్ ఈ షాట్ ఆడటంలో సిద్ధహస్తులని చెప్పారు.