అమెరికాలో మంథని కళాకారుడి అద్భుతం.. ఆకట్టుకున్న త్రీడీ మాయసభ చిత్రం..!

పెద్దపల్లి జిల్లా మంథని కి చెందిన సింగాపు శివరామకృష్ణ అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో అబ్బురపరిచారు. ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడే లేక్ వర్క్ బీచ్ స్ట్రీట్ పెయింటింగ్ ఫెస్టివల్‌లో ఆకట్టుకున్నారు. శివరామకృష్ణ గీచిన మహాభారతంలోని మాయసభ కథా చిత్రం కళ్లకు కట్టినట్లుగా తీర్చిదిద్దారు.

అమెరికాలో మంథని కళాకారుడి అద్భుతం.. ఆకట్టుకున్న త్రీడీ మాయసభ చిత్రం..!
Mahabharata 3d Film

Edited By:

Updated on: Feb 23, 2026 | 9:55 AM

పెద్దపల్లి జిల్లా మంథని కి చెందిన సింగాపు శివరామకృష్ణ అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో అబ్బురపరిచారు. ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడే లేక్ వర్క్ బీచ్ స్ట్రీట్ పెయింటింగ్ ఫెస్టివల్‌లో ఆకట్టుకున్నారు. శివరామకృష్ణ గీచిన మహాభారతంలోని మాయసభ కథా చిత్రం కళ్లకు కట్టినట్లుగా తీర్చిదిద్దారు. ఈసారి దాదాపు 850 మంది కళాకారులు పాల్గొనగా అందులో మన దేశం నుంచి కేవలం శివరామకృష్ణ మాత్రమే ఎంపిక చేసి ఆహ్వానించారు. 850లో టాప్ 50 ఆర్టిస్టులలో శివరామకృష్ణను ఎంపిక చేసి, ఫీచర్డ్ ఆర్టిస్ట్‌గా గౌరవించారు.

ఫిబ్రవరి 21, 22 తేదీలలో ఫ్లోరిడా నగరంలో లేక్ వర్క్ బీచ్ స్ట్రీట్ పెయింటింగ్ ఫెస్టివల్‌ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శివరామకృష్ణ మొదటి రోజు మహాభారతంలోని మాయసభలో ప్రస్తావించిన మాయ కొలనును చిత్రీకరించారు. ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందుతున్న ఈ త్రీడి ఆర్ట్ మన మహాభారతంలోనిదేనని, అందుకే ఈ మాయకొలనుని చిత్రీకరించానని శివరామకృష్ణ తెలిపారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అనే విషయాన్ని తను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ, దేశం గొప్పదనాన్ని విదేశాల్లో చాటాడం తనకు గర్వంగా ఉందన్నారు. తనను ఇంత పెద్ద కార్యక్రమానికి ఆహ్వానం సంతోషంగా ఉందన్నారు. The artist from Bharath, The Art from Mahabharat అని అమెరికా మీడియా ప్రశంసించినట్లు శివరామకృష్ణ తెలిపారు. ఈ కళాకారుడిని పలువురు అభినందించారు. గతంలో కూడా వివిధ రకాల త్రిడి చిత్రాలను గీశారు.ఈ త్రిడి చిత్రాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం్ ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us