ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్(Taliban)ప్రభుత్వానికి.. పాకిస్తాన్(Pakistan) ప్రభుత్వానికి మధ్య వార్ మొదలైంది. ఇరు దేశాల మధ్య రోజు రోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇటీవల తెహ్రీక్-ఇ-తాలిబాన్ స్థావరాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. బెదిరింపులతో తాలిబన్ ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఈ వైమానిక దాడికి సమాధానం చెబుతామని తాలిబాన్ ప్రభుత్వం బెదిరించింది. పొరుగు దేశాల దాడులను తాలిబన్ ప్రభుత్వం సహించబోదని ఆఫ్ఘనిస్థాన్ తాత్కాలిక రక్షణ మంత్రి ముల్లా మహ్మద్ యాకూబ్ ప్రకటించారు. అదే సమయంలో అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ హయాంలో అష్రఫ్ ఘనీ ప్రభుత్వానికి భారతదేశం ఇచ్చిన చీటల్ హెలికాప్టర్లు మరమ్మతులకు గురయ్యాయని తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని హెలికాప్టర్లకు మరమ్మతులు చేస్తున్నట్లుగా వెల్లడించారు. ప్రస్తుతం తాలిబాన్ ప్రభుత్వం వద్ద 60 విమానాలు ఉన్నాయని.. వాటిని ఇంజనీర్ల బృందం మరమ్మతులు చేస్తోందని తెలిపారు. అంటే ఇప్పుడు పాకిస్తాన్ వైమానిక దాడులు చేస్తే తాలిబన్ల వైపు నుంచి కూడా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.
ఏప్రిల్ 16న, తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని ఖోస్ట్, కునార్ ప్రావిన్స్‌లలో పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. ఇందులో 40 మందికి పైగా చనిపోయారు. వీరిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. దీని తరువాత, పాకిస్తాన్ సైన్యం డ్యూరాండ్ లైన్‌పై కూడా కాల్పులు జరిపింది. దీనిపై తాలిబన్లు స్పందించారు.
యాకూబ్ ప్రకటనపై పాకిస్థాన్ స్పందించింది
ఆఫ్ఘనిస్థాన్ తాత్కాలిక రక్షణ మంత్రి ముల్లా మహ్మద్ యాకూబ్ చేసిన ప్రకటనపై పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ.. ఇరు దేశాలలో శాంతి కోసం ఆఫ్ఘనిస్తాన్‌తో పాకిస్తాన్ దీర్ఘకాలిక సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటుందన్నారు. రెండు దేశాల మధ్య సోదర సంబంధాలు ఉండేవి. తమ ప్రభుత్వంతోపాటు పాకిస్తాన్ ప్రజలు ఇద్దరూ తీవ్రవాదాన్ని తీవ్రమైన ముప్పుగా చూస్తున్నారని అన్నారు. అందువల్ల ఇరు దేశాలు చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవడం అవసరం. ఇందుకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాం.
అంతర్జాతీయ వార్తలు ఇక్కడ చదవండి
ఇవి కూడా చదవండి: Elon Musk Buy Twitter: ఎలన్ మస్క్ చేతిలోకి ట్విట్టర్ పిట్ట.. 44 బిలియన్ డాలర్లకు డీల్..
Teething in Babies: మీ పిల్లలకి పళ్ళు వస్తున్నాయా.. అప్పుడు మీరు చేయాల్సిన పనులు ఇవే..