Viral News: ఇక నుంచి చెస్‌ ఆడితే అంతే సంగతులు… షాకింగ్‌ డెసిషన్‌ తీసుకున్న తాలిబన్లు

మేధావుల ఆటగా ప్రసిద్ధి చెందిన చెస్‌పై అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దేశంలో చెస్‌ ఆడకూడదంటూ ఆంక్షలు పెట్టింది. ఇప్పటికే పలు రకాల క్రీడలపై ఆంక్షలు విధించిన తాలిబన్లు తాజాగా చెస్‌ను నిషేధించడం చర్చనీయాంశంగా మారింది. మే ఒకటి నుంచి చెస్‌ ఆటను నిలిపివేస్తున్నట్లు...

Viral News: ఇక నుంచి చెస్‌ ఆడితే అంతే సంగతులు... షాకింగ్‌ డెసిషన్‌ తీసుకున్న తాలిబన్లు
Chess Ban

Updated on: May 12, 2025 | 8:06 PM

మేధావుల ఆటగా ప్రసిద్ధి చెందిన చెస్‌పై అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దేశంలో చెస్‌ ఆడకూడదంటూ ఆంక్షలు పెట్టింది. ఇప్పటికే పలు రకాల క్రీడలపై ఆంక్షలు విధించిన తాలిబన్లు తాజాగా చెస్‌ను నిషేధించడం చర్చనీయాంశంగా మారింది. మే ఒకటి నుంచి చెస్‌ ఆటను నిలిపివేస్తున్నట్లు ఆఫ్గాన్‌ క్రీడా మంత్రిత్వ శాఖ అదేశాలు జారీ చేసింది.

అంతేకాదు.. చెస్‌ ఆటను ఓ జూదంగా పరిగణిస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొననారు. ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా ఉందో లేదో నిర్ధారించే వరకు దేశంలో ఎవరూ చెస్‌ ఆడకూడదంటూ నిషేదాజ్ఞలు విధించారు. తాలిబన్ల ధర్మం ప్రచారం మంత్రిత్వ శాఖ సైతం అఫ్గానిస్తాన్ చెస్ సమాఖ్యను రద్దు చేసింది. ఇస్లామిక్ చట్టం చెస్‌ను ‘హరామ్’ (నిషిద్ధం)గా ప్రకటించిందని ఖామా ప్రెస్ ప్రకటించింది.

అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు. పలు రకాల కార్యక్రమాలపై ఆంక్షలు విధించారు. తాలిబన్‌ ప్రభుత్వం చెస్‌పై నిషేధం విధించే ముందు పలువురు ఆటగాళ్లు చెస్‌ సమాఖ్య అధికారులు క్రీడా మంత్రిత్వ శాఖకు విజ్ఞాపనలు చేశారు. చెస్‌ ఆడుకునేందుకు అనుమతించడంతో పాటు ఆర్థిక సహాయాన్ని కోరినట్లు తెలుస్తోంది. అయితే తాలిబన్‌ సర్కారు వారి విజ్ఞప్తులను పట్టించుకోకుండా చెస్‌పై నిషేధం విధించింది. ఇప్పటికే మహిళలు క్రీడలు ఆడకూడదంటూ నిషేధం విధించారు.