అంతరిక్ష కేంద్రంలో రెండు నెలలుగా చిక్కుకున్న నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ కు సంబంధించిన ఓ బిగ్ అప్ డేట్ ను బుధవారం రోజున నాసా వెల్లడించింది. నాసా సంస్థ తాజా ప్రణాళిక ప్రకారం వీరిద్దరూ తిరిగి భూమి మీద అడుగు పెట్టడం కోసం చాలా కాలం ఎదురు చూడాల్సి ఉంటుంది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్షం నుండి తిరిగి వచ్చే రోజు కోసం మరింత కాలం ఎదురుచూడాల్సి ఉంటుంది. అయితే నాసా ఇచ్చిన సమాచారం ఇప్పుడు ప్రతి ఒక్కరికీ భారీ షాక్ ఇచ్చింది. జూన్ 5న బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు అంతరిక్ష యాత్రకు వెళ్లారు. ఈ యాత్ర 13 రోజులు సాగాల్సి ఉంది. అయితే ఇప్పుడు 2 నెలల సమయం గడిచింది. అయినప్పటికీ వీరు తిరిగి రాలేదు. సరికదా ఇప్పటిలో వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి ఇద్దరు వ్యోమగాములను తిరిగి తీసుకురావడానికి స్టార్‌లైనర్ మాత్రమె కాదు ఇతర ప్రత్యామ్నాయ ప్రయత్నాలను కూడా NASA పరిశీలిస్తోంది. అందువల్ల సునీతా విలియమ్స్ , బుచ్ విల్మోర్‌ల పునరాగమనం కోసం మరికొన్ని నెలలు వేచి ఉండవలసి ఉంటుంది.
రిటర్న్ ప్లాన్‌పై నాసా ఏం చెప్పిందంటే?
స్టార్‌లైనర్ వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను అంతరిక్షం నుంచి తిరిగి తీసుకురావడానికి అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని .. వివిధ రకాల ఎంపికలను పరిశీలిస్తున్నట్లు నాసా అర్థరాత్రి తెలియజేసింది. మీడియాతో యుఎస్ అంతరిక్ష సంస్థ అధికారి ఒకరు మాట్లాడుతూ నాసా పరిగణించిన ఎంపికలలో ఒకటి ఫిబ్రవరి 2025 నాటికి వారిద్దరినీ అంతరిక్షం నుంచి తిరిగి తీసుకురావచ్చు. వాస్తవానికి ఈ ఎంపిక కనుక సక్సెస్ అయితే స్టార్‌లైనర్‌ని ఉపయోగించకుండా ఎలోన్ మస్క్ కు చెందిన స్పేస్‌ఎక్స్ ద్వారా వారిద్దరూ తిరిగి వస్తారని NASA వెల్లడిస్తుంది.
కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ మాట్లాడుతూ స్టార్‌లైనర్ ద్వారా బుచ్, సునీతను తిరిగి తీసుకురావడం నాసా మొదటి ప్రాధాన్యత అని.. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే, మనకు అనేక ఇతర ఎంపికలు ఉన్నాయని చెప్పారు. అంతేకాదు స్టీవ్ స్టిచ్ ఇంకా మాట్లాడుతూ నాసా స్పేస్‌ఎక్స్‌తో కలిసి క్రూ 9ని అంతరిక్ష యాత్రకు పంపడానికి పని ప్రయత్నిస్తోందని.. కనుక అవసరమైతే, సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను క్రూ 9లో చేర్చుకొనేలా తాము ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.
సునీతా విలియమ్స్ 2025లో తిరిగి వస్తారా?
క్రూ 9ని ప్రస్తావిస్తూ ఇద్దరు వ్యోమగాములను తిరిగి భూమికి తీసుకురావడానికి NASA రూపొందిస్తున్న వ్యూహాన్ని NASA అధికారి చెప్పారు. 2025 నాటికి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను తిరిగి తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యం అని చెప్పాడు. క్రూ 9 కోసం ఇద్దరు వ్యోమగాములను మాత్రమే పంపుతామని, వీరు క్రూ 9 ద్వారా అంతరిక్షంలోకి వెళ్లి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లను తిరిగి తీసుకుని వస్తారని స్టీవ్ స్టిచ్ చెప్పారు. ఇది అంతరిక్షం స్టేషన్‌లో పని చేస్తుంది. ఫిబ్రవరి 2025 నాటికి నలుగురు వ్యోమగాములను తిరిగి తీసుకువస్తారు. అయితే ఈ ప్రణాళికను నాసా ఇంకా ఆమోదించలేదని.. ప్రస్తుతం పరిశీలిస్తోందని ఆయన చెప్పారు.
వాస్తవానికి NASA మంగళవారం స్పేస్‌ఎక్స్ క్రూ 9 మిషన్ మరింత ఆలస్యం కానుందని ప్రకటించింది, ఈ మిషన్ ఈ నెలలో బయలుదేరాల్సి ఉంది. అయితే ఇది ఇప్పుడు సెప్టెంబర్ 25 వరకు వాయిదా పడింది. క్రూ 9 మిషన్ ద్వారా 4 వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపనున్నారు. ఈ మిషన్ స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్, డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా ప్రయోగించబడుతుంది.
2 నెలలు అంతరిక్షంలో ఉన్న విలియమ్స్-విల్మోర్
సునీతా విలియమ్స్ , బుచ్ విల్మోర్ జూన్ 5 న బోయింగ్ స్టార్‌లైనర్ విమానంలో అంతరిక్షానికి చేరుకున్నారు. ఇద్దరూ జూన్ 13 న భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే స్టార్‌లైనర్‌లో సాంకేతిక లోపం కారణంగా ఇది సాధ్యం కాలేదు. నాసా అధికారులు, ఇంజనీర్లు ఈ లోపాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు. 2 నెలలు గడిచినప్పటికీ సునీత, బుచ్ తిరిగి రావడానికి తేదీని నిర్ణయించలేదు.
అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండడం ప్రమాదకరం
నాసా సునీతా విలియమ్స్ , బుచ్ విల్మోర్ లు తిరిగి వచ్చే రిటర్న్ మిషన్‌ను 90 రోజులు వాయిదా వేసినప్పుడు.. ఇద్దరు వ్యోమగాములకు తగినంత రేషన్ ఉందని చెప్పింది. అందువల్ల అంతరిక్షంలో తినడానికి, త్రాగడానికి వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.. ఇద్దరూ ఎక్కువ కాలం స్పేస్ స్టేషన్‌లో ఉండగలరని వెల్లడించింది.
అయితే అంతరిక్షంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతరిక్షంలో రేడియేషన్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది వ్యోమగాముల శరీరానికి హాని చేస్తుంది. అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల, ముఖంలో వాపు, శరీరం దిగువ భాగంలో ద్రవం లేకపోవడం మొదలవుతుంది. అంతేకాదు ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడపడం వల్ల కూడా శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది.
అటువంటి పరిస్థితిలో ఫిబ్రవరి నాటికి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను తిరిగి తీసుకురావాలనే ప్రణాళికను NASA నిజంగా ఆమోదిస్తుందో లేదో చూడాలి? లేదా అది స్టార్‌లైనర్‌లోని అన్ని సాంకేతిక లోపాలను తొలగించి హ్యోమగాములు ఇద్దరూ త్వరగా తిరిగి రావడానికి మార్గం సుగమం చేస్తుందో కూడా చూడాల్సి ఉంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..