Taiwan Earthquake: తైవాన్‌లో భూకంపం.. పట్టాలపై ఊగిపోయిన రైలు.. ప్రయాణికుల పరిస్థితి ఇదీ.. షాకింగ్ వీడియో..

|

Sep 20, 2022 | 9:39 AM

Taiwan Earthquake: తైవాన్‌ను భారీ భూకంపం కుదిపేసింది. ప్రకంపణాలకు ఓ రైలు ఊడిపోగా, పలు భవానాలు దెబ్బతిన్నాయి. ఒకరు మరణించగా..

Taiwan Earthquake: తైవాన్‌లో భూకంపం.. పట్టాలపై ఊగిపోయిన రైలు.. ప్రయాణికుల పరిస్థితి ఇదీ.. షాకింగ్ వీడియో..
Train Shaking
Follow us on

Taiwan Earthquake: తైవాన్‌ను భారీ భూకంపం కుదిపేసింది. ప్రకంపణాలకు ఓ రైలు ఊడిపోగా, పలు భవానాలు దెబ్బతిన్నాయి. ఒకరు మరణించగా, 146 మంది గాయపడ్డారు. భారీ భూప్రకంపణాలతో వణికిపోయింది తైవాన్‌. వరుస భూకంపాలు ఈ ద్వీపదేశాన్ని కుదిపేశాయి. రిక్టర్‌ స్కేలు మీద భూప్రకంపణాల తీవ్రత 6.4 నుంచి 6.9 వరకూ నమోదైంది. షిసాంగ్‌ పట్టణంలో భూమికి 7 కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రం ఉందని తైవాన్‌ వాతావరణ శాఖ తెలిపింది. భూకంప తీవ్రతకు పలు భవనాలు కుప్పకూలగా రోడ్లు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భూకంప తీవ్రతకు హువాలియన్‌ నగరం యులి టౌన్‌లోని మూడంతస్తుల భవనం కూలిపోయింది. అందులో చిక్కుకుపోయిన నలుగురిని ఫైర్‌ సిబ్బంది కాపాడారు. మరోవైపు ఓ సిమెంట్‌ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో సిబ్బంది ఒకరు చనిపోయారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో 146 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.

పట్టాలపైనే ఊగిపోయిన రైలు..

హువాలియన్‌ నగరం శివారులోని ఓ వంతెన కుప్పకూలింది. వంతెన చిక్కుకుని కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయి. ఫులి టౌన్‌లోని డోంగ్లి స్టేషన్‌ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. అయితే ప్రయాణీలలు ఎవరూ గాయపడలేదు. మరోచోట ప్రకంపణాల తీవ్రతకు ఓ రైలు పట్టాలపైనే ఊగిపోయింది. మరోవైపు స్టేషన్‌లో ప్రయాణికులు బిక్కు బిక్కుమంటూ స్తంభాలను పట్టుకుని కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా. మరోచోట ఇండోర్‌ స్టేడియం కప్పు కూలిపోతుండగా టెన్నిస్‌ ప్లేయర్లు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. భూకంప సమయంలో ఓ పర్వతసానువుల్లో చిక్కుకున్న 400 మంది పర్యాటకులను అధికారులు సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. వీరంతా క్షేమంగా ఉన్నారు. తైవాన్‌లో తరచూ భూకంపాలు వస్తుంటాయి. 1999 సెప్టెంబర్‌లో వచ్చిన భారీ భూకంపంలో సుమారు 2,400 మంది చనిపోయారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..