Earthquake Croatia : పెట్రింజాలో భారీ భూకంపం.. నేలమట్టమైన ఇళ్లు.. ఆరుగురు మృతి..

|

Dec 30, 2020 | 9:41 AM

క్రొయేషియాలోని పెట్రింజాలో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 20 మందికి...

Earthquake Croatia : పెట్రింజాలో భారీ భూకంపం.. నేలమట్టమైన ఇళ్లు.. ఆరుగురు మృతి..
Follow us on

Earthquake Croatia : క్రొయేషియాలోని పెట్రింజాలో భారీ భూకంపం సంభవించింది. ప్రశాంతంగా ఉన్న నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో చాలా ఇళ్లు నేల మట్టం అయ్యాయి. కొందరు ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీయగా.. మరికొందరు ఇళ్లలోనే చిక్కుపోయారు. అలా భూకంపం కారణంగా ఏడుగురు మృతి చెందినట్లు అధికారిక సమచారం. మరో 20 మంది గాయపడగా.. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. ఇంకా చాలా మంది శిథిలాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను రక్షించేందుకు ఆదేశ భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. క్రొయేషియాలో ఇంత భారీ స్థాయిలో భూకంపం సంభవించడం 2020లో ఇది రెండవ సారి కాగా.. 140 ఏళ్లలో ఇది తొలిసారి. కాగా, క్రియేషియాలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

 

క్రొయేషియాలో భూకంపం తీవ్రత..