Viral Video: నమ్మండి.. సిగరెట్ కాల్చే అలవాటుతో ఆమె బతికిపోయింది.. నెట్టింట్లో వీడియో వైరల్..

Storm Arwen: వెంట్రుక వాసి ఆయుస్సు ఉంటే .. పాము కూడా తాడుగా మారుతుందని పెద్ద ఉవాచ. అవును ఆయుష్షు ఉంటే ఎంతటి ప్రమాదమైనా ఏమీ చేయలేదని నిరూపించే సంఘటనలు..

Viral Video: నమ్మండి.. సిగరెట్ కాల్చే అలవాటుతో ఆమె బతికిపోయింది.. నెట్టింట్లో వీడియో వైరల్..
Pub Manager

Edited By:

Updated on: Nov 29, 2021 | 1:10 PM

Storm Arwen: వెంట్రుక వాసి ఆయుస్సు ఉంటే .. పాము కూడా తాడుగా మారుతుందని పెద్ద ఉవాచ. అవును ఆయుష్షు ఉంటే ఎంతటి ప్రమాదమైనా ఏమీ చేయలేదని నిరూపించే సంఘటనలు అప్పుడప్పుడూ మనం చూస్తుంటాం. ఒక్కోసారి మనిషికి ఉండే చెడు అలవాట్లుకూడా వారిని కపాడుతుంటాయి. అలాంటి సంఘటనే ఒకటి యూకేలో జరిగింది. ఇక్కడ ఒక మహిళకు అదే జరిగింది. తనకు ఉన్న ఒక వ్యసనమే ఆమెను కాపాడింది. అదేంటో.. ఎలాగో తెలుసుకుందాం..

అర్వెన్ తుఫాను యూకేలోని అనేక ప్రాంతాలను వర్షం ముంచెత్తడంతో పలువురు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ తుపాన్‌ వస్తున్న సమయంలో బ్రిడ్జెండ్‌లోని ఒక పబ్‌ మేనేజర్‌ పబ్‌ని మూసి వేసేద్దామనకుని అక్కడ ఉన్న టేబుల్స్‌ అన్నింటిని శుభ్రం చేస్తూ ఉంది. ఇంతలో ఆమెకు సిగరెట్‌ తాగాలనిపించింది. అలా కాసేపు విరామం తీసుకుని సిగరెట్‌ కాల్చుకున్నాక మిగతా టేబుల్స్‌ని శుభ్రం చేద్దామనుకుంది. దాంతో ఆమె ఆ పబ్‌లోని టేబుల్స్‌ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో నిలబడి సిగరెట్‌ కాల్చుకుంటుంది. అంతే ఒక్కసారిగా అక్కడ ఉన్న టేబుల్స్‌ పైన ఒక పెద్ద వృక్షం కూలి పడింది. అది కూడా జస్ట్‌ ఆమెకు అరంగుళం దూరంలో పడింది. ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారింది. ఆమె గనుక విరామం తీసుకోకుండా అక్కడే టేబుల్స్‌ క్లీన్‌ చేస్తూ ఉండి ఉంటే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. చూసారా.. ఒక్కోసారి మనం చెడు అనుకున్నదే మనకు మంచి అవుతుంది. అమె వ్యసనమే ఆమె ప్రాణం కాపాడింది అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సిగరెట్ స్మోకింగ్ అలవాటుకారణంగా.. ప్రాణాలతో బయటపడిన వృద్ధురాలు.. వీడియో

Also Read:  నెలకు జీతం రూ. 4.5వేలు, ఆశ వర్కర్‌గా 15 ఏళ్ల కష్టం..నేడు ఫోర్బ్స్ ఇండియాలో స్థానం..