Srilanka Crisis: శ్రీలంక ప్రజలకు మరో షాక్.. ఆ మందుల రేట్లు భారీగా పెంచిన ప్రభుత్వం..

|

Apr 30, 2022 | 11:54 AM

Srilanka Crisis: సమస్యల సుడిగుండంలో ఉన్న శ్రీలంకను మరో కొత్త సమస్య వేధిస్తోంది. అదేంటంటే కీలకమైన మందుల రేట్లు పెరుగటమే.

Srilanka Crisis: శ్రీలంక ప్రజలకు మరో షాక్.. ఆ మందుల రేట్లు భారీగా పెంచిన ప్రభుత్వం..
Sri Lanka
Follow us on

Srilanka Crisis: సమస్యల సుడిగుండంలో ఉన్న శ్రీలంకను మరో కొత్త సమస్య వేధిస్తోంది. అదేంటంటే కీలకమైన మందుల రేట్లు పెరుగటమే. సుమారు 60 మందుల రేట్లను(Medicines Prices) ఇంతకుముందు కంటే 40 శాతం పెరగనున్నాయి. దీనికి సంబంధించి అక్కడి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వైద్యారోగ్య శాఖ మంత్రి ప్రొ. చన్నా జయసుమన(Channa Jayasumana) దీనికి ఆమోద ముద్ర వేశారు. గతంలో ఈ రేట్ల పెంపుపై చర్చ వచ్చినప్పుడు రేట్ల పెంపు 20 శాతం మేర ఉండవచ్చని అందరూ భావించారు. తాజా గెజిట్ ప్రకారం మందులను విక్రయించే తయారీదారు లేదా దిగుమతిదారు సవరించిన రిటైల్ ధరను 40% వరకు పెంచవచ్చని పేర్కొంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం పారాసెటమాల్ టాబ్లెట్ గరిష్ఠ రిటైల్ ధర రూ. 4.16గా నిర్ణయించింది. అమోక్సిసిలిన్ 375 mg టాబ్లెట్ గరిష్ఠ రిటైల్ ధర రూ.83.71గా నిర్ణయించింది.

ఇప్పటికే శ్రీలంకలో కీలకమైన ఆపరేషన్లకు అవసరమైన మందులు, సర్జికల్స్ వంటివి కూడా అందుబాటులో ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవటానికి గతంలో విదేశాంగ మంత్రి జయశంకర్ భారత్ తరఫున ఆపన్నహస్తం అందిస్తామని.. కీలక మందులను సాయంగా పంపుతామని చెప్పిన విషయం తెలిసిందే. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో(Economic Crisis) కూరుకుపోయిన లంకను కాపాడేందుకు భారత్ అన్ని రూపాల్లో సహాయాన్ని అందిస్తున్నప్పటికీ.. అవి అక్కడి పరిస్థితులను చక్కబెట్టడానికి పూర్తి స్థాయిలో సరిపోవటం లేదు.

శ్రీలంకలో కొనసాగుతోన్న ఆర్థిక సంక్షోభం రోజురోజుకీ మరింతగా ముదురుతోంది. ఆర్థిక, ఆహార, ఆరోగ్యం, ద్రవ్యోల్బణం(Inflation), ఇంధన కొరత, కరెంటు కోతలు, విదేశీ మారక నిల్వలు అడుగంటడంతో పాటు అనేక సమస్యలు లంకను ఒక్కసారిగా చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కరోనాతో పాటు లంక ప్రభుత్వాలు చైనా విషయంలో చేసిన అనేక తప్పులు ఇప్పుడు ఆ దేశానికి శాపాలుగా మారాయి. ధరలు ఆకాశాన్ని తాకడంతో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ జనం రోడ్లెక్కి ఆగ్రహావేశాలు వెల్లగక్కడంతో పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తలను చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Petrol-Diesel Price: వాహనదారులకు ఊరటనిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. తాజా రేట్ల వివరాలు..!

India Corona: దేశంలో పెరుగుతున్న కరోనా యాక్టివ్ కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?